నేపాల్ లో హైటెన్షన్ : ఇండియన్ ఎంబసీ ఎదుట బాంబు పేలుడు

nepalనేపాల్ దేశంలో అరాచక శక్తులు తెగబడ్డాయి. ఏప్రిల్ 16వ తేదీ సోమవారం రాత్రి ఖాట్మాండ్ లోని బిర్రాత్ నగర్ ఈ పేలుడు జరిగింది. ఇండియన్ కాన్స్ లేట్ ఆఫీస్ ఎదుట శక్తివంతమైన బాంబ్ పేలింది. కార్యాలయం ప్రహరీగోడలు కూలిపోయాయి. ఆఫీస్ కిటికీలు పగిలిపోయాయి. పేలుడు త్వరతా ఆ ప్రాంతం అంతా బీభత్సంగా మారింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

పేలుళ్లలో ఉగ్రమూకల ప్రమేయం లేదని.. లోకల్ పార్టీకి చెందిన కొందరు ఈ పని చేశారని మోరంగ్ ఎస్పీ అరుణ్ కుమార్ ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన బంద్ లో భాగంగా ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఇండియన్ ఎంబసీలోని అధికారులు, సిబ్బంది అంతా సేఫ్ అని.. ఎవరూ కూడా గాయపడలేని ప్రకటించారు. భయాందోళనలు సృష్టించటానికే ఈ పని చేసి ఉంటారని అధికారులు వెల్లడించారు. నేపాల్ లోని ఇండియన్ ఎంబసీ ఎదుట బాంబ్ పేలుడుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. అంతా సురక్షితం అని.. ఈ ఘటనపై నేపాల్ ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy