నోబెల్ దొంగలు దొరికారు..

satyajiఇటీవల నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. సునీల్, రాజన్, వినోద్‌లను అరెస్టు చేసి నోబెల్ బహుమతి నమూనాతో పాటు, ప్రశంసా పత్రం, ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సత్యార్థి నివాసంతో పాటు మరో రెండు ఇళ్లలో కూడా దొంగలు చొరబడినట్టు వెల్లడించారు. కాగా ఇంట్లో చోరీ జరిగినప్పుడు కైలాస్ సత్యార్థి పనామా పర్యటనలో ఉన్నారు. సత్యార్థి తన సతీమణితో పాటు పనామాలోని భారత రాయబారి, ఇతర ప్రముఖులతో కలసి పనామా అధ్యక్షుడితో విందులో పాల్గొన్న సందర్భంలోనే ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. బాలల హక్కుల కార్యకర్తగా విశేష కృషి చేసిన ఆయనకు 2014లో నోబెల్ బహుమతి ఇచ్చారు. తనకు వచ్చిన నోబెల్ పురస్కారాన్ని ఆయన 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమర్పించారు. సత్యార్థి నోబెల్ పురస్కారం ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇంట్లోని నమూనా పురస్కారాన్నే అసలు నోబెల్ బహుమతి అనుకుని దొంగలు ఎత్తుకెళ్ళినట్లు వెల్లడించారు పోలీసులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy