నోరాతో గురకకు చెక్

2E440E4B00000578-3310154-Nora_was_developed111చాలా ఫ్యామిలీస్ లో గురక ఒక సమస్యగా మారింది. ఒకప్పుడు మగవాళ్లలో 24శాతం.. ఆడవాళ్లలో 16 శాతం ఉన్న ఈ సమస్య.. ప్రస్తుతం మగవాళ్లలో 60 శాతం.. ఆడవాళ్లలో 40 శాతానికి పెరిగింది. ఈ సమస్య నుంచి జనానికి రిలీఫ్ ఇచ్చేందుకు.. పరిష్కారం కనుక్కుంది.. శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ కంపెనీ. నోరా పేరుతో మార్కెట్లోకి తెస్తోంది. నోరా అంటే ఏ టాబ్లెటో లేక ఆయింట్ మెంటో కాదు. ఒక చిన్న హెడ్ మ్యాట్ లాంటి డివైస్. దీన్ని యూస్ చేయటం కూడా చాలా ఈజీ. ఇందుకు చేయాల్సిందల్లా.. జస్ట్ ఈ డివైస్ మ్యాట్ ను దిండు కింద పెట్టుకుని పడుకోవటమే. మీ గురక పని అదే చూసుకుంటుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా గురకను దూరం చేస్తుంది.

contour-anti-snore-pillow 1సాధారణంగా మనమంతా ముక్కుతో శ్వాస తీసుకుంటాం. కొందరిలో ముక్కు లోపల, గొంతు మొదటి భాగంలో వాపు వల్ల, లావుగా ఉన్నవారిలో కొవ్వు పేరుకుపోవటంతో.. నిద్ర పోతున్న టైమ్ లో శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారుతుంది. దీంతో బలంగా శ్వాస తీసుకుంటారు. ఇదే గురకకు మెయిన్ రీజన్. సాధారణంగా నిద్రలో గురకపెట్టే వారిని కదిపితే గురక కొద్దిసేపు ఆగుతుంది. ఈ పాయింట్ నే ఆధారం చేసుకొని నోరా డివైస్ ని తయారుచేశారు. జస్ట్ మ్యాట్ ని దిండుకింద పెట్టుకుని.. ఈ చిన్న అబ్జెక్ట్ ని క్లిక్ చేస్తే చాలు. గొంతు నుంచి వచ్చే తరంగాలను కనిపెట్టి మ్యాట్ కి సిగ్నల్ ఇస్తుంది. అప్పడు మ్యాట్ తలను నెమ్మదిగా పక్కకు వాలుస్తుంది. దీంతో రిలాక్స్ అయిన మెడలోని కండరాలు.. సాధారణ స్థితికి వచ్చి శ్వాస ఆడుతుంది. అంతే గురక ఆగిపోతుంది.

బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది…. ఈ గురకను ఆపే పరికరం. ఇక దీని ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంది. అమెరికా కరెన్సీలో 299 డాలర్లు. మన మనీలో దాదాపు 20 వేలు. ఫైనల్ గా గురకకు ఫుల్ స్టాప్ పెడుతుంది ఈ ఇంస్ట్రుమెంట్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy