నో పాలిటిక్స్: రజనీకాంత్

rajiniదివంగత సీఎం జయలలిత మరణం తర్వాత అక్కడి రాజకీయాలపై తమిళ ప్రజలంతా అసహనంతో ఉన్నారు. అన్నాడీఎంకె కుమ్ములాటలు, అనిశ్చితి రాజకీయాలతో విసిగిపోయిన అక్కడి జనం.. తమ కొత్త నాయకుడిని ‘రజనీకాంత్’ రూపంలో ఊహించుకున్నారు. ఆయనైతేనే తమను సమర్థవంతంగా నడిపించగలరన్నది చాలామంది నమ్మకం. ఎవరి ఊహాగానాలు, అంచనాల మాటెలా ఉన్నా.. రజనీకాంత్ మాత్రం తన పొలిటికల్ ఎంట్రీని వస్తున్న వార్తలను ఖండిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 2న అభిమానులంతా చెన్నైకి తరలిరావాలని రజనీ నుంచి పిలుపు వెళ్లడం.. మరోసారి ఆయన రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తిని రేకెత్తించింది. తలైవా ఇక పొలిటికల్ ట్రాక్ ఎక్కడం ఖాయమని, మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందని ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే ఈ ఊహాగానాలన్నింటిని పటాపంచలు చేస్తూ రజనీకాంత్ మరోసారి ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. అభిమానుల సమావేశాన్ని వాళ్లే ఏర్పాటు చేసుకున్నారని, ఆరోజు వారిని కలుసుకోవాల్సి ఉన్నా.. వేరే కార్యక్రమాల వల్ల వీలు కావడం లేదని తెలిపారు. దీంతో రజనీ పొలిటికల్ ఎంట్రీపై ఏదో సంచలన వార్త వెలువడబోతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy