నో మనీ : పని చేయండి..తిని వెళ్లండి

HL_marblelounglp04_5_675x359_FitToBoxSmallDimension_Centerహాటళ్లలో బాగా తిన్నాక పర్సు మరచిపోయామని చెప్పడం..అందుకు హోటల్ యాజమాని పిండి రుబ్బించడం లాంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం కదా. ఇప్పుడు నిజంగానే ఇలాంటి ఆలోచన వచ్చింది ఓ వ్యక్తికి. అయితే డబ్బులు లేకున్నాసరే ముందు తమ హోటల్ లో పని చేయండి..తర్వాత తిని వెళ్లండి అంటున్నాడు. సాధారణంగా వీకెండ్స్ లో ఇంట్లో కాకుండా ఏదైనా హొటల్ కు వెళ్లారనుకోండి..ముందు ఏం చేస్తారు ఆర్డర్ ఇస్తారు. ఆ తర్వాత ..ఏం చేస్తారు వచ్చేదాకా వెయిట్ చేసి, ఆర్డర్ ఇచ్చినవి తీసుకొస్తే తింటామంటారు అంతేకదా!. అయితే జపాన్ టోక్యోలోని జిన్ బోనే జిల్లాలో మాత్రం ఓ వింత హోటల్ ఉంది. మీరు ఆర్డర్ ఇచ్చిన భోజనం రావాలంటే మీరే కిచెన్ లోకి వెళ్లి, మీవంట మీరే చేసుకోవాలి. ఎందుకంటే అదే ఆ హోటల్ ప్రత్యేకత. సెకాయ్ కొబయాషి అనే 33 ఏళ్ల ఇంజనీర్ కు ఈ ఐడియా వచ్చింది. కనీసం వారానికి ఒక్కసారైనా బయటతినలేని వారికోసం ఈ హోటల్ పెట్టినట్లు ఆయన చెబుతున్నారు. వంట ఒక్కటేకాదు టేబుళ్లు తుడవటం..నీరందించడం..ఫుడ్ సర్వ చేయడంవరకు ఏ పనైనా చేయొచ్చు. పనిచేయడం ఇష్టంలేనివారు డబ్బులు ఇచ్చి ఎంచక్కా తినేయొచ్చు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ శాశ్వతంగా పని చేసేందుకు ఒక్క వర్కర్ కూడా ఉండరు. ఇప్పటివరకు ఇక్కడ 500 మంది పనిచేసి భోజనం చేసివెళ్లారని సంతోషంగా చెబుతుంటాడు సెకాయ్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy