
మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్ లోని సాత్నా జిల్లా ప్రైవేట్ స్కూల్ లో అమలు అవుతోంది. విద్యార్థులు అందరూ హాజరు సమయంలో జైహింద్ అనాలని సూచించారు మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్ షా. ఈ పద్దతి వల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ అనుమతితో మధ్య ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేస్తామని చెబుతున్నారు. ఇది ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఒక సలహా మాత్రమేనని విజయ్షా చెప్పారు. చిత్రకూట్లో జరిగిన ప్రిన్సిపాల్స్, టీచర్ల డివిజనల్ స్థాయి సమావేశంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. అక్టోబర్ ఒకటి నుంచి ఈ నూతన విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.