న్యాయం గెలిచింది : గుర్మీత్ కు పదేళ్ల జైలు

JAILడేరా బాబా గుర్మీత్ సింగ్ కు శిక్ష ఖరారైంది. రేప్ కేసులో గుర్మీత్ ను పదేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఉద్రిక్తతల కారణంగా సునారియా జైలుకే వెళ్లిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. ప్రాసిక్యూషన్ లాయర్లు.. గుర్మీత్ పదేళ్ల శిక్ష విధించాల్సిందే అని వాదించారు. దోషిగా తేలాడు కాబట్టి.. కఠిన శిక్ష విధించాలని కోరారు. మరోవైపు గుర్మీత్ తరపు లాయర్లు మాత్రం అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. గుర్మీత్ చేసిన సమాజ సేవను పరిగణలోకి తీసుకోవాలన్నారు. శిక్ష తగ్గించాలని కోరారు. ఏ తప్పు చేయలేదని చెబుతూ జడ్జి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు గుర్మీత్ బాబా. అందరి వాదనలు విన్న తర్వాత.. గుర్మీత్ కు పదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు జడ్జి జగ్దీప్ సింగ్.

గుర్మీత్ కు పదేళ్ల జైలు శిక్ష ఖరారు తర్వాత.. పోలీసులు అలర్ట్ అయ్యారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 25వ తేదీ ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అల్లర్లు చేసే వారిని కాల్చిపారేస్తామని ముందస్తు హెచ్చరికతలతో ఆందోళనలను కంట్రోల్ చేశారు. అయితే గుర్మీత్ ప్రధాన ఆశ్రమం అయిన సిర్సాలో మాత్రం రెండు వాహనాలకు నిప్పు పెట్టారు ఆయన అభిమానులు.

కేసు నేపథ్యం ఇదీ :

2002లో సిర్సాలోని డేరా ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలను గుర్మీత్ రేప్ చేసినట్టు.. ఒక మహిళ అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పెయికి లేఖ రాయడంతో ఇది వెలుగు చూసింది. తనతో పాటు మరో మహిళను బాబా రేప్ చేశాడని ఆమె లేఖ రాసింది. ఈ లేఖను 2002 సెప్టెంబర్ లో పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు సుమోటోగా తీసుకుంది. గుర్మీత్ పై కేసు పెట్టాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో 18 మంది మహిళలను సీబీఐ ప్రశ్నించింది. 2007 జూలైలో సీబీఐ స్పెషల్ కోర్టులో ఛార్జిషీట్ వేశారు. IPC 376, 506 సెక్షన్ల కింద గుర్మీత్ పై అభియోగాలు నమోదు చేశారు. 2008 సెప్టెంబర్ లో వాదనలు మొదలయ్యాయి. తాను ఏ తప్పు చేయలేదని, తప్పుడు కేసు పెట్టారని గుర్మిత్ వాదించారు. అసలు శారీరక సంబంధాలకు తన శరీరం పనికిరాదని డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఈనెల  17న వాదనలు పూర్తయ్యాయి. అప్పుడు తీర్పును రిజర్వ్ లో పెట్టిన కోర్టు.. 25న గుర్మీత్ ను దోషిగా ఖరారు చేసింది. 28వ తేదీ సోమవారం పదేళ్ల శిక్ష విధించింది కోర్టు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy