న్యాయపర అడ్డంకులు లేకుండా నోటిఫికేషన్లు

Kadiyam-Srihariఉద్యోగాల నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయపర అడ్డంకులు లేకుండా నోటిఫికేషన్లు జారీ చేసి వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు న్యాయపర ఇబ్బందులు రాకుండా వేగంగా నియామకాలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, టిఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా, టిఎస్పీఎస్సీ మెంబర్ సెక్రటరీ వాణి ప్రసాద్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావుతో సమావేశం జరిగింది.

సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు  వివిధ శాఖల్లోని ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడానికి, న్యాయపర ఇబ్బందులు లేకుండా టిఎస్పీఎస్సీ ద్వారా వెంటనే నోటిఫికేషన్లను ఇవ్వడానికి గల మార్గదర్శకాలను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఎదురవుతున్న న్యాయపర, ఇతర ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఇప్పుడు అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పాత పదిజిల్లాలను ప్రాతిపదిక  చేసుకుని నోటిఫికేషన్లు ఇవ్వాలా? కొత్తగా ఏర్పాటు చేసుకున్న 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని నోటిఫికేషన్లు జారీచేయాలా? అన్న అంశంపై న్యాయశాఖ తన ప్రతిపాదనలు, సలహాలు వెంటనే ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అడిగారు. అదేవిధంగా ఈ ఖాళీల భర్తీ జాప్యం కాకుండా ఉండేందుకు శాఖల వారిగా ఖాళీల సంఖ్యను గుర్తించి, వాటి భర్తీకోసం అభ్యర్థులకు కావాల్సిన విద్యార్హతలు, రోస్టర్ పాయింట్లను కూడా రూపొందించాలని ఆదేశించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో మరోసారి ఇదే అంశంపై సమావేశం కావాలని నిర్ణయించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy