న్యాయమే గెలిచింది: పళనిసామి

Edapadi-K.-Palanisamy-1-1024x682ఎంజీఆర్, జయలలిత ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు తమిళనాడు సీఎం పళనిసామి. మేరీనా బీచ్ లో జయ సమాధి దగ్గర నివాళులర్పించిన పళనిసామి.. అమ్మ జయలిత బాటలో నడుస్తామని చెప్పారు. జయలలిత ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తామన్నారు. బలనిరూపణలో న్యాయం గెలిచిందని చెప్పారు పళనిసామి.

తమిళనాడు అసెంబ్లీలో జరిగిన 5 గంటల హైడ్రామా అనంతరం బలపరీక్షలో గట్టెక్కి సీఎం పళనిసామి బయటపడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు లేకుండానే సభలో ఓటింగ్ ను ప్రారంభించారు స్పీకర్ ధన్ పాల్. పళనికి 122 ఓట్లు వచ్చాయి. మొత్తం ఆరు బ్లాకుల కౌంటింగ్ అనంతరం స్పీకర్ పళని గెలిచినట్టు ప్రకటించారు. డీఎంకే సభ్యులను మార్షల్స్ సభ నుంచి బయటకు లాక్కెల్లగా.. కాంగ్రెస్, ముస్లింలీగ్  పార్టీలు వాకౌట్ చేశాయి. పళని గెలిచినట్టు ప్రకటించగానే.. పళనీ వర్గీయులు అసెంబ్లీ బయట సంబరాలు చేసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy