న్యాయవాది నుంచి  రాష్ట్రపతి వరకు.. రామ్‌నాథ్ కోవింద్

kovind1_ptiభారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. దళిత నాయకుడైన రామ్‌నాథ్ కోవిండ్ అక్టోబర్ 1, 1945న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లా దెరాపూర్ నియోజకవర్గం పరుంఖ్‌లో జన్మించారు. ప్రస్తుతం కోవింద్ వయసు 71 ఏళ్లు. రామ్ నాథ్ కోవింద్ కాన్పూర్‌లోని డీఏవీ కాలేజీలో బీకామ్ డిగ్రీ చేశారు.  లా డిగ్రీ తీసుకున్నది డీఏవీ కాలేజీ నుంచే. ఆ తర్వాత ఢిల్లీలో ఉంటూ సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యారు. మూడోసారి ప్రయత్నించి పరీక్షల్లో విజయం సాధించారు. అయితే ఐఏఎస్‌లో కాకుండా దాని అనుబంధ విభాగాలకు ఎంపిక కావడంతో ఆ సర్వీసుల్లో చేరకుండా న్యాయవాద వృత్తిని స్వీకరించి విజయవంతంగా పనిచేశారు.

1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో రామ్‌నాథ్ న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టులో 1977 నుంచి 79 వరకు సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్‌గా, 1980 నుంచి 93 వరకు సుప్రీం కోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టులో 16 ఏళ్లపాటు ఆయన పనిచేశారు. విద్యారంగంలోనూ ఆయన సేవలు అందించారు.

కోవింద్ 1994లో ఆయన తొలిసారిగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. బీజేపీ తరపున 1994-2000, 2000-2006 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ నుంచి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఆలిండియా కోరీ సమాజ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాజ్‌నాథ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోవింద్ కీలకంగా వ్యవహరించారు. బీజేపీ అధికార ప్రతినిధిగానూ ఆయన పనిచేశారు. 2002లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారతప్రతినిధిగా ప్రసంగించారు. ఆగస్టు 8, 2015న రామ్‌నాథ్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గవర్నర్‌గా నియమించారు. రామ్‌నాథ్ భార్య పేరు సవితా కోవింద్. 1974లో వివాహమైన వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy