న్యూగునియాలో భారీ భూకంపం

NEWన్యూగునియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత నమోదైంది. సోమవారం (ఫిబ్రవరి-26) తెల్లవారు జామునే ఈ ప్రమాదం జరిగింది.  భూకంపకేంద్రం భూమి లోపల 35 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. దక్షిణ హైలాండ్‌కు రాజధాని ప్రాంతంగా ఉన్న మెండీకి సమీపంలో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో సుమారు 50 వేల మంది జనాభా నివసిస్తున్నారు. భూకంప తీవ్రతతో స్థానికులు భయాందోళనలు చెందారు. ఇళ్ళలో నుండి పరుగులు తీశారు. 40 సెకండ్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy