న్యూజిలాండ్ పై భారత్ సూపర్ విక్టరీ

nz-indiaమలేషియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నీలో న్యూజిలాండ్ పై విజయం సాధించింది ఇండియా. ఆదివారం జరిగిన ఆసక్తికర పోరులో 3-0తో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం బ్రిటన్‌‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 2-2తో డ్రాగా సరిపెట్టుకున్న భారత్.. ఈ మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌పై 24వ నిమిషంలో అద్భుత రీతిలో గోల్ చేసి తొలుత మన్‌దీప్ భారత్ ఖాతా తెరవగా.. తర్వాత మూడు నిమిషాల్లోనే హర్మన్‌ప్రీత్ మరో గోల్‌తో ఆధిక్యాన్ని 2-0తో రెట్టింపు చేశాడు. దీంతో న్యూజిలాండ్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే 30వ నిమిషంలో మరోసారి పెనాల్టీ కార్నర్‌తో హర్మ‌న్‌ప్రీత్ భారత్‌ను 3-0తో సంపూర్ణ ఆధిక్యంలో ఉంచాడు. మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించింది భారత్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy