న్యూయార్క్ లో భారీ పేలుడు

newyork bombఅమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ నగరంలో భారీ పేలుడు సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రఖ్యాత మాన్‌హట్టన్‌ ప్రాంతంలో సోమవారం(డిసెంబర్-11) ఉదయం 7:45 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. 42వ వీధి, ఎనిమిదో అవెన్యూ సమీపంలోని పోర్ట్‌ అథారిటీ బస్‌ టెర్మినల్‌ వద్ద పేలుడు కేంద్రాన్ని గుర్తించారు. ఈ మేరకు న్యూయార్క్‌ మేయర్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే మృతికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు.

న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌(ఎన్‌వైపీడీ) ఇప్పటికే ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుందని, పోర్ట్‌ రవాణా కేంద్రంలోని ఏ, సీ, ఈ లైన్లను తాత్కాలికంగా మూసివేశారని అధికారులు చెప్పారు.
మాన్‌హట్టన్‌ పేలుడుకు సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టెర్మినల్‌లో బదిగిన తనకు రెండు సార్లు భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయని, ఆ సమయంలో హెడ్‌సెట్‌ పెట్టుకున్నప్పటికీ చెవులు ఘొల్లుమన్నాయని ఫ్రాన్సిస్కో అనే ప్రయాణికుడు తెలిపారు. పేలుడు ఉగ్రదాడా, లేక మరొకటా అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy