న్యూ లుక్ లో మాస్టర్‌ బ్లాస్టర్‌

sachinమాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్ త్వరలో ఓ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ‘ప్లేయింగ్‌ ఇట్‌ మై వే’ పేరుతో 2014లో సచిన్‌ బయోగ్రఫీని విడుదల చేశారు. 486 పేజీలున్న ఈ బుక్ లోని  కొన్ని కీలక అంశాలను తీసుకుని ఇప్పుడు మరో పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఈ బుక్ ను మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు.

చిన్నారులను ఎక్కువగా ఆకర్షించే కామిక్‌ పాత్రల సాయంతో ఈ బుక్ ను డిజైన్‌ చేయనున్నారు. దీంతో సచిన్‌ కొత్త గెటప్‌లో కనిపించి చిన్నారులను అలరించనున్నాడు. ఈ బుక్‌లో సచిన్‌ హీరో. దీంతో ఇప్పుడు సచిన్‌ ఈ పుస్తకంలో ఏ లుక్‌లో కనిపిస్తారన్న దానిపై ఆసక్తి  ఏర్పడింది. వారం రోజుల్లో ఈ పుస్తకం అందుబాటులోకి రానుంది. 25 పేజీల ఈ కామిక్‌ పుస్తకంలో సచిన్‌కు సంబంధించిన కీలక అంశాలను పొందుపరచనున్నారు. ఆయన చిన్నతనంలో స్టంప్స్‌పై కాయిన్ ను పెట్టి రమాకాంత్‌ ఆచ్రేకర్‌ క్రికెట్ ప్రాక్టీస్ చేయించిన అంశాలతో పాటు 1998లో షార్జాలో ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్‌ ఇన్నింగ్స్‌ గురించి ఈ బుక్ లో ప్రస్తావించనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy