న‌యీమ్ డెడ్ బాడీకి ముగిసిన పంచనామా

nayeem111ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీమ్ డెడ్‌బాడీకి పంచ‌నామా పూర్తి చేశారు పోలీసులు. కాసేప‌ట్లో పోస్టుమార్టం కోసం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించే అవ‌కాశం ఉంది.  శంషాబాద్ మిలీనియం టౌన్‌షిప్‌లో ఓ సెటిల్‌మెంట్ చేస్తుండ‌గా ప‌క్కా స‌మాచారంతో ఆ ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. ఆ ఇంటిలోనుంచి కాల్పులు శ‌బ్దం విన‌ప‌డ‌టంతో ఎదురు కాల్పులకు దిగారు పోలీసులు. కాసేప‌టికి వెళ్లి చూడ‌గా ఆ ఇంట్లో రెండు శ‌వాలు క‌నిపించాయి. ఒక‌రిని న‌యీమ్‌గా గుర్తించారు పోలీసులు. దాదాపు 20 ఏళ్ల‌పాటు తెలుగు రాష్ట్రాల పోలీసుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టిన న‌యీమ్ చివ‌ర‌కు ఈరోజు గ్రేహౌండ్స్ ద‌ళాల జ‌రిపిన ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మ‌య్యాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy