పంచాయతీ ఎన్నికలు : జూన్ 6న ప్రకటన

veeravelly gpగ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ ఎన్నికల సంఘం
ఈ క్రమంలోనే జూన్ 6వ తేదీ ప్రకటన విడుదల చేసి, అదేనెల 23వ తేదీలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ల పదవీకాలం జులైతో ముగుస్తుంది. దీంతో ఎలక్షన్స్ అంతకంటే నెలరోజుల ముందే నిర్వహించి, ఆగస్టు 1వరకు సర్పంచ్ లు అధికారంలోకి వచ్చేలాగా ప్రణాళికలను రచిస్తోంది.

రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం.. ఎన్నికల ప్రకటన వెలువడ్డ తేదీని కలుపుకొని 12వ రోజున పోలింగ్‌, ఓట్ల లెక్కింపుల ప్రక్రియను పూర్తి చేయాలి. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ వంటివి కొత్త చట్టం చెబుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వాటితో కలిపి ప్రస్తుతం 12 వేల751 పంచాయతీలు, వాటిలో 1 లక్షా13 వేల380 వార్డులు ఉన్నాయి. వీటిలో సర్పంచ్ లు పదవీ కాలం పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం ఉన్నా.. 15 పంచాయతీలను పక్కన పెడితే, మిగతా వాటన్నింటికీ ఎన్నికలను నిర్వహించాలి. పంచాయతీలు పెద్దసంఖ్యలో ఉన్నందున పోలింగ్‌ ను మూడు విడతల్లో నిర్వహిస్తారు. ఇదంతా జూన్‌ 23వ తేదీకి ముగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పంచాయతీల వారీ, వార్డుల వారీ ఓటర్ల ఫైనల్ లిస్ట్ మే- 17న వెలువడతాయి. వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. వీటన్నింటిలోనూ జనరల్‌ కేటగిరి స్థానాల్లోను తిరిగి 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయిస్తారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy