పంచాయతీ రిజర్వేషన్లపై సుప్రీంను ఆశ్రయిస్తాం : కేసీఆర్

పంచాయితీ రాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50శాతం దాటొద్దని మంగళవారం (జూలై-9) హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ప్రకటించారు. పంచాయితీ రాజ్ సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని కోరాలని నిర్ణయించారు సీఎం.
దీనికోసం అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం (జూలై-11) కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని ఆదేశించారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ తో పాటు ఇతర సంబంధిత అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచి, అన్ని విషయాలను కూలంకశంగా చర్చించి, పూర్వాపరాలను సమగ్రంగా పరిశీలించాలన్నారు. తెలంగాణలోని పంచాయితీ రాజ్ సంస్థల్లో 61 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరాన్ని చెప్పేవిధంగా వాదనలు ఖరారు చేయాలని కోరారు సీఎం కేసీఆర్.
BCలకు 34 శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. తమ పార్టీ సర్పంచ్ స్వప్నా రెడ్డి ద్వారా హైకోర్టులో పిటిషన్ వేయించిL, కాంగ్రెస్ పార్టీ.. BCల రిజర్వేషన్లకు గండి కొట్టిందని విమర్శించారు. BCలకు 34 శాతం రిజర్వేషన్ కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఇందుకు అవసరమైన న్యాయ పోరాటం చేస్తామన్నారు సిఎం కేసీఆర్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy