పంచాయతీ సమరం : ఓట్లను బట్టే బీసీ రిజర్వేషన్లు

panchపంచాయతీ ఎన్నికల్లో బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగానే రిజర్వేషన్లను నిర్ణయించనున్నారు. త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో ఈ ప్రక్రియను అమలు చేయనున్నందున బీసీ ఓటర్ల సంఖ్య గణన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకూ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఉండనున్నాయి. అయితే ఈ గణాంకాలు అధికారులు దగ్గర అందుబాటులో ఉన్నందున.. వీటి ఆధారంగానే ఎస్సీ, ఎస్టీ ఓటర్లను గుర్తిస్తారు. రెండు  నెలల్లో ఎన్నికలు నిర్వహించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సమయంలో.. 2011 జనాభా గణననే ప్రామాణికంగా తీసుకుంటారా లేక కొత్తగా గణన ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయా అనేది ఆసక్తిగా మారింది. 2011 జనభా లెక్కల ప్రకారం బీసీ గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో వారికి రిజర్వేషన్లలో అన్యాయం జరుగొచ్చనే వాదన ఉంది.

పంచాయతీ ఎన్నికల కోసం ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ జరుగుతుంది. ఏప్రిల్‌ 30న రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించారు. ఇప్పటికే జిల్లా, మండల స్థాయిల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ నెల 8వ తేదీ వరకు ఓటరు జాబితా సవరణ కోసం అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 10వ తేదీ నాటికి అభ్యంతరాలను పరిశీలించి, 17న పంచాయతీ ఓటరు జాబితా తుది నోటిఫికేషన్లను జారీ చేస్తారు.

పచాయతీల్లో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లను ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో 43 వేల పదవులు బీసీలకు దక్కనున్నాయి. రాష్ట్రంలో 12వేల 751 పంచాయతీలుండగా.. వీటిలో 34 శాతం కోటాలో 4వేల 335 సర్పంచ్‌ పదవులు బీసీలకు దక్కనున్నాయి. 1.13 లక్షల పంచాయతీ వార్డు పదవుల్లోనూ 38వేల 500 పదవులు బీసీలకు రానున్నాయి. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీల పాలకమండళ్ల ఐదేళ్ల పదవీకాలం గడువు ఆగస్ట్ ఒకటో తేదీతో ముగియనుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 90 రోజుల ముందు నుంచే ఎన్నికల ప్రక్రియకు వెళ్లే వెసులుబాటు ఉంది. ఈ లెక్కన ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy