పంజాబ్ హీరో.. కేపీఎస్ గిల్ కన్నుమూత

Gillపంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ కన్నుమూశారు. పంజాబ్ లో ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కీలక పాత్ర పోషించారు గిల్. కొద్ది కాలంగా ఆయన ముత్రపిండాల వ్యాధితో, గుండెకు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం ఛాతినొప్పి రావడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. 1989లో భారత ప్రభుత్వం కేపీఎస్ గిల్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1958 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గిల్ 1995లో ఉద్యోగం నుంచి పదవి విరమణ చేశారు. ఇండియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు గిల్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy