పంటలకు పెద్దపులుల కాపలా

MDK DBK PULI NIGHA3పెద్దపులి కన్పిస్తే కాదు… ఆ మాట వింటేనే భయంతో వణికి పోతారు.  ఆ ఊరు వాళ్లు మాత్రం  పులిని మెడపై ఎత్తుకుని వెళ్తారు. అంతే కాదు సంతోషంతో గెంతులేస్తారు. వీళ్లకు ఇంత ధైర్యం ఎక్కడిదనే కదా మీడౌట్. అయితే మీరనుకున్నట్లు నిజమైన పెద్దపులి కాదు..బొమ్మపులులు. ఎందుకిలా బొమ్మల్ని పొలాల్లో ఊరేగిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారా ? దానికో పెద్ద కథే ఉంది.

 

MDK DBK PULI NIGHA1

సరిగ్గా వర్షాలు పడక నెలలు గడుస్తున్నాయి.  అడపా దడపా వచ్చిపోతున్న వానతో పాటు కాస్తో, కూస్తో బావులు, కాలువల నీటితో పంటలు పండించుకుంటున్నారు రైతన్నలు.  అవి మొలకెత్తి … కాయ దశ వచ్చే సరికి కోతులు  రెడీ అవుతున్నాయి.  మెదక్ జిల్లాలోని దుబ్బాక మండలం దుంపలపల్లిలో రైతన్నలది ఇదే పరిస్థితి. ఇప్పుడిప్పుడే మొక్క జొన్న పంటలో కంకులు వస్తున్నాయి.. కానీ కోతులు వీటిని బతకనీయడం లేదు. కోతులను తరమడానికి ఎన్నో ప్లాన్స్ వేశారు గ్రామస్థులు.  చివరకు ఓ నిర్ణయానికి వచ్చారు.  గ్రామస్థులంతా కలసి ఐదు పులి బొమ్మలు కొన్నారు. వాటిని పొలాలు, తోటల్లో ఉంచుతున్నారు. ఈ బొమ్మలను చూసి నిజంగా పులి వచ్చిందేమోనని భయపడుతున్న కోతులు… పారిపోతున్నాయని చెబుతున్నారు గ్రామస్థులు

MDK DBK PULI NIGHA2పులి బొమ్మలు బాగానే వర్కవుట్ అయ్యాయి.  వాటిని చూసి కోతులు దరిదాపుల్లోకి రాకపోవడంతో రైతులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు పంటలను కాపాడుకోగలుగుతున్నామని చెబుతున్నారు దుంపలపల్లి గ్రామస్థులు.

 

MDK DBK PULI NIGHA4

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy