పండుగ పేరుతో చార్జీల బాదుడు

Rush in trainsసంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లాలనే వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైళ్లలో సీట్లు దొరికే పరిస్థితి లేదు. సరిపోను బస్సులు లేవు. ఉన్నా అధిక చార్జీలు వసూలు చేస్తుండటంతో.. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో.. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. స్పెషల్ బస్సుల పేరుతో.. దాదాపు డబుల్ చార్జీలు వసూలు చేస్తోంది ఆర్టీసీ. ఇక ప్రైవేటు ఆపరేటర్లు ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు.  గత మూడు రోజుల్లోనే దాదాపు 10లక్షల మంది సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లారు. పండుగ సందర్భంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన 2,470 స్పెషల్ బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. కామన్ డేస్ లో హైదరాబాద్ నుంచి విజయవాడకు 304 చార్జ్ ఉంటే.. ప్రస్తుతం 450 రూపాయలు దాటింది. వైజాగ్ కు ఇతర రోజుల్లో 750 ఉంటే ప్రస్తుతం 1,600 చార్జ్ చేస్తున్నారు. చార్జీల రూపంలోనే వేలకు వేలు ఖర్చు చేయాల్సి రావటంతో.. ఫ్యామిలీతో వెళ్లాలంటేనే భయపడుతున్నారు జనాలు. చంటి పిల్లలతో చలిలో బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందంటున్నారు ప్రయాణికులు. సరిపోను బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బస్టాపుల్లో సరైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలేదని ఆరోపిస్తున్నారు. పండుగకు వెళ్లే ప్రయాణికులపై చార్జీల భారం మోపటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. పండుగ దగ్గర పడటంతో.. ప్రయాణం భారంగా మారింది. కిక్కిరిసిన రైళ్లు, బస్సుల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. పరిస్థితిని అర్ధం చేసుకుని.. అదనపు రైళ్లు, బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy