పంతం మూవీ ఫస్ట్ లుక్ విడుదల

pantamమాచో హీరో గోపిచంద్ చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో పంతం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మెహ‌రీన్ క‌థానాయికగా న‌టిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంది. మే 18న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో గోపిచంద్ సీరియ‌స్ లుక్‌తో క‌నిపిస్తున్నాడు. పంతం అనే టైటిల్‌కి ఫ‌ర్ ఏ కాజ్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమాతో త‌ప్ప‌క స‌క్సెస్ సాధించాల‌నే క‌సితో గొప్పగా యాక్టింగ్ చేశాడు గోపిచంద్. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. కెకె రాధామోహన్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy