పంత్ పంట పండింది : ఐదు క్యాచ్ లతో రికార్డు

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డులు సాధించాడు. అరంగేట్రంతోనే ఐదు క్యాచులు పట్టిన నాలుగో వికెట్ కీపర్ గా ఘనతను సాధించాడు. పంత్ కు ముందు భారత కీపర్లలో తమ్ హానే, కిరణ్ మోరే, నమాన్ ఓజా ఉన్నారు.  బ్యాట్స్ మన్ గానూ రిషబ్ పంత్ తన టెస్ట్ కెరీర్‌ ని సిక్సర్‌ తో ప్రారంభించాడు. దీంతో సిక్సర్ తో టెస్ట్ కెరీర్ ను ప్రారంభించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.

శనివారం (ఆగస్టు-18) టెస్ట్‌ ల్లో ఆరంగేట్రం చేసిన పంత్, కోహ్లీ వికెట్ తర్వాత బ్యాటింగ్‌ కి వచ్చాడు. రషీద్ వేసిన 78వ ఓవర్‌లో రెండో బంతికే పంత్ సిక్స్‌ కొట్టి టెస్టుల్లో తన ఖాతాని తెరిచాడు. అంతేకాక ఇంటర్నేషనల్ క్రికెట్‌ లో ఈ ఫీట్ సాధించిన 12వ క్రికెటర్‌ గా నిలిచిన పంత్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

రెండో రోజు ఆదివారం (ఆగస్టు-19) ఆట చివరకు టీమిండియా ఆధిక్యం 292 పరుగులు. ఇంగ్లండ్ అధ్బుత ప్రదర్శన చేయకపోతే భారత్ విజయం ఖాయమే. బౌలర్లు సత్తా చాటితే మూడో రోజే మ్యాచ్ సొంతమవుతుంది.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy