పంద్రాగస్టు స్పెషల్… బేగంపేట స్పానిష్ మసీదులో అందరికీ అనుమతి

మసీదుల్లో ముస్లీం మగవారికి మినహా ఇతరులకు అనుమతుండదు. రోజుకు ఐదుసార్లు నమాదు చేసే ఆ పవిత్రమైన మసీదు పంద్రాగష్టున మాత్రం, ఆడ-మగ, హిందు-ముస్లీంలతో కళకళలాడింది.
స్పానిష్ వాస్తు శైలిలో.. యురోపియన్ మొగలాయి అందాలు కలబోసి నిర్మించిన మసీదులు ప్రపంచంలో రెండే రెండు ఉన్నాయి. ఒకటి స్పెయిన్ లో ఉంటే.. మరొకటి మన హైదరాబాద్ లో ఉంది. సిటీ పర్యటనకు వచ్చే స్పెయిన్ పర్యాటకులు.. ఈ మసీదును తప్పక సందర్శిస్తారు. బేగంపేట్ ప్రకాష్ నగర్ లో ఉన్న ఈ మసీదు ‘పాయిగా’ నవాబు అద్బుత నైపుణ్యంతో నిర్మించారు. ఏటా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు ఈ మసీదు సందర్శనకు అనుమతిస్తారు.
ఈ మసీదుకి ఎంతో చరిత్ర ఉంది. పాయిగా వంశీయుల నవాబు ఐదో అమీర్ , హైదరాబాద్ ప్రధాని సర్ వికార్ ఉల్ ఉమ్రా స్పెయిన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ అద్బుత వాస్తు నైపుణ్యంతో ఉన్న స్పానిష్ మసీదు చూసి.. తమ ప్రాంతంలో ఇలాంటిదే నిర్మించాలనుకుని.. బేగంపేట ప్రకాశ్ నగర్ లో ఈ మసీదు నిర్మాణాన్ని ప్రారంభించారు. 1897లో బేగంపేటలో స్పానిష్ మసీదు నిర్మాణ పనులు ప్రారంభించారు. దాదాపు 3ఏళ్లు ఈ నిర్మాణానికి సమయం పట్టింది. మసీదు నిర్మించి దాదాపు 100ఏళ్లు దాటినా… ఇప్పటికీ చెక్కు చెదరలేదు. హిందు-ముస్లీం సమానత్వం చాటి చెప్పడానికే స్వాతంత్ర్య దినోత్సవం రోజున అందరికీ అనుమతిస్తున్నమంటున్నారు నిర్వాహకులు.
సాధారణ మసీదుల్లోకి మహిళలను అనుమతించరు. కానీ దీన్ని చూడటానికి పంద్రాగష్టు రోజు అనుమతిస్తారని తెలియడంతో మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో సందర్శించారు. అన్ని వర్గాల పర్యాటకులతో మసీదు ఆవరణ కళకళలాడింది. పురాతన మసీదును చూసే అవకాశం కలిగడం సంతోషంగా ఉందన్నారు మహిళలు.
ఇక్కడ సందర్శకులకు బిస్కట్లు.. కర్బూజ.. సమోసలతో పాటు కాఫీ ఉచితంగా ఇచ్చారు. ముస్లీంలు విశ్వషించే అల్లా.. చరిత్ర తెలియడానికి మసీదు ప్రాంగణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అద్భత కట్టడమంటూ మసీదు ముందు ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు పర్యాటకులు.
స్పెయిన్ స్టైల్ లో ఉన్నఈ మసీదును చూడటానికి విదేశీయులు కూడా వచ్చారు. ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్పెయిన్ దేశస్థులు ఈ మసీదును దర్శించి తమ దేశంలో ఉన్న ఫీలింగ్ ఉందంటున్నారు. స్పెయిన్ మసీదు ప్రత్యేకతను పర్యాటకులకు చెప్పేందుకు ప్రత్యేకంగా ముస్లిం వాలంటీర్లను ఏర్పాటు చేసింది మసీదు అభివృద్ధి కమిటీ. ఆగస్టు 15న మాత్రమే సందర్శకులను అనుమతించే స్పెయిన్ మసీదును చూడాలంటే మళ్లీ పంద్రాగష్టు వరకు ఆగాల్సిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy