పక్కా ఆధారాలతోనే నోటీసులు : అకున్ సబర్వాల్

ED-Akun-Sabharwal-On-Notices-To-Tollywood-Celebsసినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో పక్కా ఆధారాలతోనే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశామన్నారు. కొంతమందికి నోటీసులిచ్చామని తెలిపారు. ఈ నెల 19 నుంచి ఒక్కో రోజు ఒక్కొక్కరిని విచారిస్తామన్నారు. నోటీసులిచ్చినట్టుగా తామెవరి పేర్లను అధికారికంగా ప్రకటించలేదన్నారు. పక్కా ఆధారాలు దొరికిన తర్వాతే నోటీసులు ఇచ్చి… విచారిస్తున్నామని వెల్లడించారు. దర్యాప్తులో మాపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు అకున్ సబర్వాల్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy