పచ్చికపై చెలరేగడానికి.. మేం రెడీ

Wimbledon-2017సీజన్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ వచ్చేసింది. పచ్చికపై పోరుకు ఇవాళ(సోమవారం జూలై 3) షురూ కానుంది. అంతేకాదు ఈ వింబుల్డన్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. వింబుల్డన్ ఛాంపియన్ షిప్ కు 140 ఏళ్లు. ఈ వేడుకలకు గుర్తుగా గ్రాస్‌కోర్టు గ్రాండ్‌స్లామ్ కోసం ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ గ్రాండ్‌గా ముస్తాబైంది. గ్రాస్ కోర్టుపై సంచలనాలు నమోదు చేయడానికి అటు సీనిరయర్లతో పాటు.. ఇటు జూనియర్లు రెడీ అయ్యారు. స్టార్ ఆటగాళ్లు ఫెదరర్, నాదల్, ముర్రే, జకోవిచ్ విన్యాసాలు చూడటానికి గ్రాస్ కోర్టు ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.

భారత్ నుంచి..

ఈసారి డబుల్స్‌లో భారత్ నుంచి సానియామీర్జాతో పాటు లియాండర్‌ పేస్‌, రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్‌, పూరవ్‌ రాజా, జీవన్‌ నెడున్‌చెజియన్‌ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో బోపన్నకు ఒక్కడికే సీడింగ్‌ లభించింది. ఇటీవల అతను ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే. పేస్‌-షంసద్దీన్‌, బోపన్న-రోజర్‌ వెస్లిన్‌, పూరవ్‌ రాజా-దివిజ్‌ శరణ్‌, జీవన్‌-డొనాల్డ్‌సన్‌లతో జట్టు కట్టారు. మహిళల డబుల్స్‌లో సానియామీర్జా-క్రిస్టిన్‌ ఫ్లిప్కెన్స్‌తో కలిసి 13వ సీడ్‌గా పోటీలో నిలిచింది.

గూగుల్ డూడుల్.. వింబుల్డన్ @140 

మరోవైపు 140 ఏళ్ల వింబుల్డన్ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవానికి గుర్తుగా గూగూల్ డూడుల్‌ను రూపొందించింది. 9 జూన్ 1877లో సౌత్‌వెస్ట్ లండన్‌లో లాన్ టెన్నీస్ క్లబ్ ఆధ్వర్యంలో విబుల్డన్ మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. 2017 సంవత్సరంలో నేటి నుంచి జూలై 16 వరకు ఈ పోరు జరగనుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy