పటాకులు కాల్చడం ఇష్టం లేదు

diwali-firecrackersపటాకులు కాల్చడం మాకు ఇష్టం లేదు..  ఈ మాటలు అంటున్నది ఢిల్లీ నగర ప్రజలు. అందరూ కాదు ఎక్కువ శాతం ఇదే మాట చెబుతున్నారట. ఈ విషయం ఓ సర్వే ద్వారా బయటపడిన విషయం. సుప్రీం కోర్టు తీర్పుతో 87 శాతం మంది ఢిల్లీ ప్రజలు బాణాసంచాకు దూరంగా ఉన్నట్లు ఒక సర్వే ప్రకటించింది.  కేవలం 5 శాతం మంది ప్రజలు మాత్రం దీపావళి పండుగ సందర్భంగా పటాకులు కాల్చేందుకు సిద్ధపడుతున్నారట. దీపావళి-బాణాసంచాపై నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌-ఢిల్లీలో లోకల్‌ సర్కిల్స్‌ సర్వే సంస్థ సర్వే నిర్వహించింది.

సుప్రీం కోర్టు ఉత్తర్వులతో 87 శాతం మంది ప్రజలు పటాకులు కాల్చడం ఇంట్రెస్టు లేదని తెలిపారు. ఇందులో కేవలం 5 శాతం అంటే 4 వేల 600 మంది తమ దగ్గర ఇప్పటికే పటాకులు ఉన్నాయని.. వాటిని కాలుస్తామని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల్లో ఢిల్లీ ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే ప్రకటించింది. ముఖ్యంగా దీపావళి సమయంలో నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌-ఢిల్లీలో కాలుష్యం మరింత తీవ్రంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో ఉండే కాలుష్యంతో పోలిస్తే.. దీపావళి సమయంలో ఐదు రెట్లు అధికంగా ఉంటుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy