‘పటేల్ సర్’ గా జగపతి బాబు

jpజగపతిబాబు హీరోగా మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా సినిమా పటేల్. S.I.R అనే ట్యాగ్ లైన్ తో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా ప్రముఖ యాడ్ ఫిలిమ్ మేకర్ వాసు పరిమి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గురువారం వారాహి చలన చిత్రం ఆఫీస్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా థీమ్ తెలిసే ఓ టీజర్ ను రిలీజ్ చేశారు. రాజమౌళి తనయుడు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు డీజే వసంత్ సంగీతం అందిస్తున్నాడు.

గతంలో చేసినట్టుగా లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో టైప్ సినిమాలు కాకుండా.. యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు జగపతి బాబు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy