పట్టణ పేదలకు 20 లక్షల ఇళ్లు: వెంకయ్య

M-Venkaih-Naidu...2022 నాటికల్లా అందరికీ సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలనేదే ప్రధానమంత్రి మోడీ లక్ష్యమన్నారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 4720 నగరాల్లో 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సొంతింటి కలలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సాకారం చేస్తాయని, గృహ నిర్మాణాలను ప్రోత్సహించేందుకే వడ్డీరేట్లు తగ్గించామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 93 వేల ఇళ్లను మంజూరు చేశామని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్దఎత్తున ఆహ్వానిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. విజయవాడలో గృహనిర్మాణాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ఆయన.. గృహ నిర్మాణ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రగతి ఆధారంగా అదనపు ఇళ్లను మంజూరు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులు విరివిగా గృహ రుణాలు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుల, మతాలకు వ్యతిరేకంగా ఇళ్ల నిర్మాణం జరగాలని ఆయన సూచించారు. “హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌”ను విజయవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో పనిచేయాలని కోరారు.

Leave a Reply

bathukamma song

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy