పట్టపగలే గొంతులు కోస్తున్నారు

9999

 

 

 

 

 

 

 

 

 

Chain Image

 

 

 

బైకులపై దూసుకోస్తున్నారు.. గొలుసుల్ని గుంజేస్తున్నారు..మహిళల్ని గజగజా వణికిస్తున్నారు.. రెప్పపాటు కాలంలో అనుకున్న పని కానించేసి రయ్ మని పత్తాలేకుండా పోతున్నారు..ఇక్కడా అక్కడా అనికాదు..గల్లీల నుంచి..పీక్ పబ్లిక్ ఏరియాలో..వీఐపీ ఏరియాల్లో..మిట్టమద్యాహ్నం,అర్ధరాత్రి అపరాత్రని తేడా లేకుండా చెలరేగిపోతున్నారు చైన్ స్నాచర్లు. ఇవాళ ఒక్కరోజే  ఆరు చోట్ల స్నాచింగ్ కు పాల్పడ్డారు. మొత్తం 25 తులాల బంగారం దోచేశారు. ఫిలిం నగర్ లో పట్టగలే బ్లాక్ పల్సర్ బైక్ పై దూసుకొచ్చిన దుండగులు అందరూ చూస్తుండగానే మాజీ మంత్రి బంధువు సత్యవతి మెడలోంచి రెండు తులాల చైన్ లాక్కెల్లి పరారయ్యాడు.

సీసీ కెమెరాల్లో రికార్డులకే పరిమితం..కనిపించని రికవరీలు..నిందితుల జాడలు..ఇదీ ప్రజెంట్ పోలీసింగ్.. పేరుకు భారీగా పెట్రోలింగ్ వెహికిల్స్ ఉంటాయ్..ప్రతీ చౌరస్తాలో ఇన్నోవాలు,ఇంటర్ సెప్టార్ వెహికిల్స్ దర్శనమిస్తాయ్ కానీ మిట్టమద్యాహ్నం చోర్ గాళ్లు శివాలెత్తుతున్న వాసన పసిగట్టడం లేదు..కనీసం స్నాచింగ్ జరిగిన తర్వాత జీపీఎస్ సిస్టమ్ తో ఉన్న వెహికిల్స్ నిందుతుల్ని పట్టుకోలేక పోతున్నారు..

Chain Image 1అయితే నగరంలో వరుస స్నాచింగులు ఎక్కువగా..మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య, రాత్రి 7 గంటల సమయంలోనే ఎక్కువ చోరీలు జరుగుతున్నాయ్..అంతేకాదు నిత్యం స్నాచింగ్స్ జరుగుతున్న ఏరియాల్ని హాట్ స్పాట్ ఏరియాలుగా గుర్తిస్తున్న పోలీసులు ఆ ఏరియాల్లో నిఘా పెట్టడంలో ఫెయిలవుతున్నారన్న విమర్షలున్నాయి.

 

 

 

నగరంలో వరుస ఘటనలు .. చోద్యం చూస్తున్న పోలీసులు .. బెంబేలెత్తుతున్న ప్రజలు

రెప్ప పాటులో మహిళల వద్దకు చేరుకోవడం, గొలుసులు లాగేసుకోవడం, నెట్టేయడం చకచకా చేసేసి కనిపించకుండాపోతున్నారు..

చిలకలగూడ, మారేడ్‌పల్లి… బేగంపేట, నారాయణగూడ, చిక్కడపల్లి, అబిడ్స్, నాంపల్లి, సైఫాబాద్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, అంబర్‌పేట, హబ్సిగూడ, నల్లకుంట ప్రాంతాలు…శివారు ప్రాంతాలు ఎల్బీనగర్, చైతన్యపురి, కర్మన్‌ఘాట్, అల్వాల్, ఏఎస్ రావు నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చెయిన్ స్నాచర్లు రెచ్చిపోతున్న ఘటనలు నమోదవుతున్నాయి.

జూలై 17    –   బర్కత్‌పుర వాసి సుమిత్ర కుమారుడు సంజయ్‌తో కలసి ద్విచక్ర వాహనంపై ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డు మీదుగా వెళుతున్నారు. టూ వీలర్‌పై వచ్చిన దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసు లాగడమే కాదు. ఏకంగా నెట్టేయడంతో కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

జూలై 29… హైదరగూడకు చెందిన సుభాషిణి భర్తతో కలిసి అబిడ్స్‌లో సినిమా చూసి అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును తెంచడమే కాకుండా నెట్టేశారు. కింద పడడంతో ఆమె గాయాలపాలైంది. ప్రస్తుతం ప్రాణాపాయం లేకున్నా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

జూలై 31… కుంట్లూరులోని అట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హయత్‌నగర్ డివిజన్ ప్రగతి నగర్‌కు చెందిన వెంకటలక్ష్మి సాయంత్రం నాలుగు గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా… ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారు. ఎవరూ లేని ప్రాంతం చూసి ఆమె స్కూటీకి అడ్డంగా బైక్ పెట్టారు. ఆమె వాహనం నిలిపే లోపే మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు.

చైన్ స్నాచర్లు హల్ చల్ చేస్తుంటే…. అడ్డుకట్ట వేయడంలో మాత్రం పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎవరేమనుకున్నా తాము చేయాల్సింది తాము చేస్తున్నామంటున్నారు పోలీసులు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy