పట్టాలు తప్పిన ‘రాజధాని’ ఎక్స్ ప్రెస్..

sadanda_gowda_cmరాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఢిల్లీ నుంచి అస్సాంలోని డిబ్రుఘర్ కు వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ లోని 11 బోగీలు పట్టాలు తప్పాయి. బీహార్ రాష్ట్రంలోని చాప్రా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురుగ ప్రాణాలు కొల్పోయారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి దగ్గర్లోని ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

ఇక రైల్వే రెస్క్యూ టీంలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికే ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.  ఘటన వెనక మావోయిస్టుల హస్తం ఉందా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. బీహార్ హోంశాఖ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. చాప్రా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాదని చెప్తుంది. చాప్రా ఏఎస్పీ సుశీల్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదని…ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామన్నారు.

ప్రమాదంపై స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ..ఘటన  జరగడం బాధాకరమన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష గాయపడిన వారికి రూ.20 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy