పట్టాలు తప్పిన  హైదరాబాద్ ప్యాసింజర్ రైలు

train-derailఔరంగాబాద్ – హైదరాబాద్ ప్యాసింజర్ రైలు తప్పింది. కర్నాటకలోని కల్గూపూర్‌-భీల్కీ రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సమాచారమందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరంచేశారు. ఈ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మరోవైపు రైలు ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు రైల్వే శాఖ హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసింది.  ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్‌: 040-23200865, పర్లీ:  02446-223540,వికారాబాద్: 08416-252013 ‌, బీదర్‌: 08482-226329. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy