పట్టాలెక్కిన సైన్స్ ఎక్స్ ప్రెస్

15brk-trainaవాతావరణంలోని మార్పులను కళ్లకు కట్టినట్లు చూపించే సైన్స్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రభుత్వం పట్టాలెక్కించింది. క్లైమెట్ ఛేంజ్ స్పెషల్  పేరుతో  ఈ సైన్స్ ఎక్స్‑ప్రెస్ రైలు ఏడు నెలలపాటు దేశమంతటా ప్రయాణించి.. ప్రజలకు పర్యావరణ మార్పులపై అవగాహన కల్పించనుంది. గ్లోబల్ వార్మింగ్ , పర్యావరణ మార్పుల వల్ల తలెత్తున్న ముప్పును ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా, స్థానికంగా తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించేవిధంగా ఈ  రైలును రూపొందించారు.

61444904492_625x300ఈ సైన్స్ ఎక్స్ ప్రెస్ ను ఢిల్లీలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు. 16 బోగీలు ఉండే  ఈ రైలు 19 వేల కిలోమీటర్లు ప్రయాణించనుంది. దాదాపు 20 రాష్ట్రాల్లో 64 స్టేషన్లలో ఆగుతుంది. ఏడు నెలల పాటు అన్ని ప్రాంతాల్లో తిరిగే ఈ రైలును సందర్శించేందుకు పర్మిషన్ ఇస్తారు. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుమతినిస్తారు. ఇండియాలో ఎక్కువ కాలం పాటు నడిచిన అతిపెద్ద రైలుగా సైన్స్ ఎక్స్ ప్రెస్ ఇప్పటికే ఆరు జాతీయ రికార్డులను సొంతం చేసుకుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy