పట్టించుకోరా: తాజ్ మ‌హ‌ల్‌ రంగు మారుతోంది

tajmahalఆగ్రాలోని చారిత్రక తాజ్‌మహల్‌ రంగు మారిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళనం వ్యక్తం చేసింది. గతంలో పసుపు రంగులోకి మారిన ఈ కట్టడం క్రమంగా గోధుమ, ఆకుపచ్చ రంగులోకి మారుతోంది. కలర్ చేంజ్ అవుతున్నా మీరు ఏం చేస్తున్నారంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం. తాజ్‌మహల్‌కు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం వెంటనే భారత, విదేశీ నిపుణుల సాయం తీసుకోవాలని, ఆ తర్వాతే చారిత్రక కట్టడం పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సుప్రీం‍ కోర్టు సూచించింది. మన దగ్గర చారిత్రక కట్టడాలను పరిరక్షించే నైపుణ్యం ఉందో లేదో మాకు తెలియదు. దానిపై ప్రభుత్వానికి ఇంట్రెస్ట్  తగ్గిందని సుప్రీం బెంచ్‌ పేర్కొంది. ఆ తర్వాత కేసు విచారణను ఈ నెల 9కి కోర్టు వాయిదా వేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy