పఠాన్‌కోట్‌ దాడిపై ఇండో-పాక్ విచారణ

nawaz-sharifపఠాన్‌కోట్‌ ఎయిర్ బేస్ పై  జరిగిన ఉగ్ర దాడిపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి సంయుక్త విచారణ కమిటీని నియమించాలని పాక్  ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆదేశాలు జారీచేశారు. జనవరి 15వ తేదీన ఇస్లామాబాద్‌లో జరగాల్సిన  ఇండో-పాక్‌ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలతో ఇండియా దీన్ని ముడిపెట్టడంతో షరీఫ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు పాక్‌ మీడియా తెలిపింది. ఇంటిలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), ఇంటర్‌ సర్వీస్‌ ఇంటిలిజన్స్‌(ఐఎస్‌ఐ), మిలిటరీ ఇంటిలిజెన్స్‌(ఎంఐ)ల అత్యున్నత స్థాయి అధికారులతో షరీఫ్‌ అధ్యక్షతన ఓ సమావేశం  జరిగింది. మీటింగ్ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం పాక్‌ ప్రధాని కార్యాలయం నుంచి ఓ ప్రకటన వచ్చింది. కమిటీ వెయ్యాలన్న నిర్ణయంతో పఠాన్‌కోట్‌ దాడి ఘటనపై షరీఫ్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లయింది. భారత్‌-పాక్‌ సంబందాలపై ఈ నిర్ణయం ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy