పఠాన్ కోట్ ఘటన పై అనుమానాలు

pathankotఆపరేషన్ పూర్తైనా.. సేఫ్టీ కోసం ఎయిర్ బేస్ మొత్తాన్ని జల్లెడపట్టాయి భద్రతా దళాలు. ఎయిర్ బేస్ లో ఆస్తినష్టం లేకపోయినా… సెక్యూరిటీ వింగ్స్ ను ఎన్నింటినో దాటుకుని… భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో ముష్కరులు లోపలికి ఎలా వెళ్లారనేదే అసలు క్వశ్చన్. గురుదాస్ పూర్ నుంచి పఠాన్ కోట్ దాకా చెక్ పోస్టులు.. అడుగడునా గస్తీ కాసే పోలీసులు.. ఇవన్నీ దాటుకుని ఎయిర్ బేస్ లోకి ఎలా వెళ్లారన్నది భద్రతా దళాలకు సవాల్ గా మారింది.  కూంబింగ్ పూర్తయ్యాక.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎయిర్ బేస్ ని పరిశీలించింది. పఠాన్ కోట్ అటాక్ లో అన్ని వేళ్లూ… ఎస్పీ సల్విందర్ సింగ్ వైపే చూపిస్తున్నాయి. సల్విందర్ పొంతనలేని సమాధానాలు.. అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. అందుకే NIA.. సల్విందర్ సింగ్ వెళ్లొచ్చిన బమియాలోని పంజ్ పిర్ దర్గా… పరిసర ప్రాంతాలను పరిశీలించింది. సల్విందర్ ను తీస్కెళ్లి స్పాట్ లో విచారించింది.   డిసెంబర్ 31న ఎస్పీ… రాత్రి 9.30 గంటలకు దర్గాను సందర్శించాడని అక్కడి పూజారి సోమ్ నాథ్ స్టేట్ మెంట్. రాత్రి 12.30 తర్వాత టెర్రరిస్టుల చెర నుంచి బయటపడ్డానని ఎస్పీ కథనం. మరి మధ్యలో మూడు గంటలు ఏం చేసినట్టు. డ్రైవర్ ను చంపిన ఉగ్రవాదులు… ఎస్పీకి ఎలాంటి హాని చేయకుండా ఎందుకు వదిలేశారన్నది క్వశ్చన్. అయితే ఆ రాత్రి ఏం జరిగిందో తనకూ.. దేవుడికే తెలుసని ఎస్పీ చెబుతుండటంతో.. సల్విందర్ పై అనుమానాలు పెరిగాయి. డిసెంబర్ 31న ఎస్పీ రెండుసార్లు పంజ్ పిర్ దర్గాను సందర్శించాడన్నది పూజారి కథనం. లేట్ నైట్ కుదరదని చెప్పినా.. అధికారి హోదాలో ఆర్డర్ వేయడం వల్ల తెరిచి ఉంచక తప్పలేదన్నాడు. అంతేకాదు ఒకే రోజు రెండుసార్లు దర్గాను సందర్శించడం డౌట్ కొట్టిందన్నాడు. ఇక పంజ్ పిర్ దర్గాకు రెగ్యులర్ గా వెళ్లొస్తుంటానని ఎస్పీచెప్పాడు. కానీ దర్గాను చూసుకునే సోమ్ మాత్రం ఆయన్ని చూడటం అదే ఫస్ట్ టైం అని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. వీటిసంగతి పక్కనపెడితే… దర్గా చుట్టుపక్కల పాకిస్తాన్ మేడ్ బూట్ల గుర్తులను NIA గుర్తించింది. దాంతో ఎస్పీ మరింత ఇరుక్కున్నారు. ఎస్పీపై అనుమానాలు ఎక్కువవడంతో NIA ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇక గురుదాస్ పూర్ కు 40 కిలోమీటర్ల దూరంలో టిబ్రి అనే ప్రాంతంలో ఇద్దరు అనుమానితులున్నారన్న సమాచారంతో గాలింపుచర్యలు చేపట్టింది ఆర్మీ. దాంతో టిబ్రిలో హైటెన్షన్ క్రియేట్ అయింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy