పఠాన్ కోట్ దాడిపై ఇండో- పాక్ చర్చలకు బ్రేక్

modi-sharifఇండియా – పాక్ చర్చలకు బ్రేక్ పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ రెండు దేశాల విదేశాంగశాఖ కార్యదర్శుల మధ్య ఇస్లామాబాద్ లో చర్చలు జరగాల్సింది. పఠాన్ కోట్ దాడితో ఈ భేటీకి నో చెప్పింది భారత్. దాడికి కారణమైన వాళ్లందరినీ అరెస్ట్  చేస్తేనే డిస్కషన్స్ ఉంటాయని చెప్పింది. పాక్ మాత్రం విషయాన్ని ఎటూ తేల్చలేకపోయింది. భారత్ ఇచ్చిన ఆధారాలతో దాడులు చేసిన పాక్ దళాలు కొంతమంది జైషే మహ్మద్ తీవ్రవాదులను అరెస్ట్ చేశాయి. అయితే.. కీలక వ్యక్తులను మాత్రం అరెస్ట్ చేయలేకపోయాయి. దీంతో చర్చలకు బ్రేక్ పడింది. ఇందులో మౌలానా మసూద్ అజహర్ ని అరెస్ట్ చేశామని చెప్పడం.. దానిపై పాక్ విదేశాంగ శాఖ క్లారిటీ ఇవ్వకపోవడం పాక్ ఇచ్చిన లెటెస్ట్ ట్విస్ట్. పాక్ చర్చలకు రెడీగా ఉన్నా.. భేటీపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఖలియుల్లా ఖాజీ. రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు పొరుగు దేశాలతో కలిసి పనిచేస్తామని చెప్పారాయన. చర్చల రీ షెడ్యూల్ కు సంబంధించి పాక్ ఫారిన్ సెక్రటరీ అజీజ్ అహ్మద్ తో మాట్లాడారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్. నెక్స్ట్ డిస్కస్ ఎప్పుడనేది తర్వాత తేలుస్తామన్నారు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్. ఇండియా పాక్ చర్చలకు బ్రేక్ పడటంపై పొలిటికల్ పార్టీల నుంచి మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. ఉగ్రవాదంపై పాక్ తీరును కొందరు విమర్శిస్తోంటే.. మరికొందరు కేంద్రం వైఖరిని తప్పుపడుతున్నారు. శాంతి చర్చలు ఆపడం స్వాగతించదగ్గ పరిణామమని.. కానీ ఇది పరిష్కారం కాదన్నారు కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. పాక్ నుంచి సరైన స్పందన వచ్చేదాకా ఒత్తిడి తేవాలన్నారు. పాక్ తో చర్చలను రీ షెడ్యూల్ చేయాలన్న భారత నిర్ణయాన్ని స్వాగతించారు కమ్యూనిస్ట్ నేత డీ. రాజా. చర్చలకోసం వెంపర్లాడకుండా.. రెండు దేశాలు ఉగ్రవాదంపై ఖచ్చితమైన నిర్ణయానికి రావాలని సూచించారు. యాక్షన్ ఫస్ట్.. టాక్స్ నెక్ట్స్ అన్న భారత్ కండిషన్ కు పాక్ బాగానే రియాక్టైంది. అయినాసరే వంకరబుద్ధి పోనిచ్చుకోలేదు. మసూద్ అజార్ అరెస్ట్ పై క్లారిటీ ఇవ్వకపోగా.. మరిన్ని ఆధారాలు కావాలని అడగడం దాయాది దేశం తెంపరితనాన్ని సూచిస్తోంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy