పడేయొద్దు !

బ్రెడ్‌ , కోడిగుడ్డు పెంకులు, అరటి తొక్కలు, పుల్లటి పాలు, పులిచిన మజ్జిగ.. ఇలాం టివి దేనికీ పనికి రావనుకుని పడేస్తుంటాం. కాకపోతే ఫ్రిడ్జ్‌‌లో రోజుల తరబడి ఉంచిన పదార్థా లు, తినగా మిగిలిన ఆహారం
లాంటివి తిరిగి ఉపయోగిం చుకోవచ్చు. అయితే, వాటిని తినడానికి కాకుం డా.. మరో విధంగా వినియోగిం చుకోవచ్చు.

గడువు దాటిన బ్రెడ్‌
బ్రెడ్‌ తినడానికి ఒక టైం ఉంటుంది. గడువు దాటితే బ్రెడ్‌ని పడేస్తుంటాం. అయితే, బ్రెడ్‌ బూజు పట్టకుం డా ఉంటే దాంతో క్రూటన్స్‌‌, బ్రెడ్‌ క్రంబ్స్‌‌ తయారు చేసుకోవచ్చు. బ్రెడ్‌ ను చతురస్రాకారంలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి.. వాటిపై ఆలివ్‌‌ ఆయిల్‌‌ చల్లాలి. తర్వాత ఒవెన్‌‌లో గోధుమ రంగు వచ్చే వరకు బేక్‌ చేస్తే సరిపోతుం ది. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి.

కోడి గుడ్డు పెంకులు
ఉడికిం చిన కోడిగుడ్ల పెంకుల్ని పారేస్తుంటాం. అయితే, వాటిని మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. ఇవి సహజ సిద్ధమైన ఎరువుగా ఉపయోగ పడతాయి. పెరటి మొక్కలకు పట్టే చీడలను తొలగిం చడంలో కోడి గుడ్డు పెంకులు బాగా పనిచేస్తాయి.

అరటి తొక్కలు
తిని పడేసే అరటి తొక్కలతో లెదర్‌‌ బూట్లను పాలిష్‌ చేసుకోవచ్చు. షూ పాలిష్‌ అయిపోయినా, అందుబాటులో లేకపోయినా అరటి పండు ఉంటే చాలు. అరటి పండులో పొటాషియం నిల్వలు పుష్కలంగా ఉంటాయి. షూ పాలిష్‌ లో కూడా కీలకమైన పదార్థం పొటాషియం. అరటి తొక్క లోపలి భాగంతో షూ పాలిష్‌ చేసి తర్వాత పొడి గుడ్డతో శుభ్రం చేస్తే బూట్లు మెరిసిపోతాయి.

వంట సోడా
వినియోగిం చే గడువు దాటిన బేకిం గ్‌ సోడాని వంటల్లో వాడలేం . దాంతో బాత్రూమ్‌ , వంట గదిలో ఏర్పడే మరకలను తొలగిం చవచ్చు. బేకిం గ్‌ సోడా క్లీనిం గ్‌ ఏజెంట్‌‌గా పని చేస్తుంది. కుళాయిలకు, స్టీల్‌‌ గిన్నెలు మెరిసేలా చేస్తుంది. అంతేకాదు కుం డలు, పాన్స్‌‌ మీద ఏర్పడే మరకలను తొలగిం చవచ్చు.

పుల్లటి పాలు
పుల్లటి పాలను బేకిం గ్‌ ఫుడ్స్‌‌లో మజ్జిగకు బదులు వాడొచ్చు. అయితే, అవి పాశ్చరైజ్డ్‌ మిల్క్‌ అయి ఉండాలి. పాన్‌‌ కేక్‌ , బిస్కట్స్‌‌ తయారీలో పుల్లని పాలు వాడితే మంచి రుచివస్తాయి.

సుగంధ ద్రవ్యాలు
ఇంట్లో గడువు దాటిన సుగంధ ద్రవ్యాలు ఉంటే వాటిని కొవ్వొత్తు లుగా మార్చుకోవచ్చు. ముందుగా కొవ్వొత్తి మైనాన్ని కరిగిం చి సుగంధ ద్రవ్యాలలో కలిపితే కొత్త కొవ్వొత్తి తయారవుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy