పతంజలి రెస్టారెంట్లు వస్తున్నాయ్!

ramdev-resturentsయోగా గురు రామ్ దేవ్ బాబా… మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే … ఆయుర్వేదిక్ వస్తువులు, సబ్బులు, షాంపూల మార్కెట్ లో దూసుకుపోతున్న రామ్ దేవ్.. కొత్తగా రెస్టారెంట్ మార్కెట్ లోకి ప్రవేశించారు. పంజాబ్ రాజధాని చంఢీఘర్ లో రెస్టారెంట్ ప్రారంభించారు. పోస్తిక్ రెస్టారెంట్ పేరుతో ఏర్పాటైన ఈ రెస్టారెంట్ గోడలపై రామ్ దేవ్ బాబా, బాలకృష్ణ ఫొటోలతోపాటు మెనూ పెట్టారు. హెల్త్ టిప్స్ తో పాటు… పోషకాహార విలువలను రాశారు. 100 శాతం శాఖాహార రెస్టారెంట్ ఇది. తొలుత ఈ రెస్టారెంట్ బయటి వాళ్లు చేశారని భావించినా… రిజిస్ట్రేషన్ వివరాలు గమనిస్తే… పతంజలి పేరుపై రిజిస్టర్ చేయించారు. త్వరలోనే మరిన్ని రెస్టారెంట్లు ప్రారంభించే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ రెస్టారెంట్లు ప్రారంభించనున్నట్టు సమాచారం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy