పత్తి రైతు పొట్టగొడుతున్న వ్యాపారులు

cottonపత్తి రైతు మరోసారి దగా పడుతున్నాడు. నిబంధనల్లోని లొసుగులను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు… రైతుకు టోపీ పెడుతున్నారు. క్వాలిటీ లేదని వంకలు పెడుతూ… తక్కువ ధరకు అమ్మాలంటూ… రైతులను మోసం చేస్తున్నారు. వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులు… అన్నదాతల పొట్ట కొడుతున్నారు.

పంటకు సరైన మద్దతు ధర దక్కాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ విధానం సరిగా అమలు కావడంలేదు. నామ్ లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా మార్కెట్ వ్యాపారులు. వ్యాపారుల అత్యాశతో నాణ్యమైన పత్తి చేతికి వచ్చిందన్న సంతృప్తి రైతులకు లేకుండా పోయింది.  పత్తి నాణ్యత ఆధారంగా ఎక్కువ రేటు వస్తుందని భావించిన రైతులకు ఊహించని విధంగా తక్కువ ధరను నిర్ణయిస్తున్నారు. ఇతర మార్కెట్ల రేట్లతో పోల్చితే పెద్దపల్లి మార్కెట్లో పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు గత పదిహేను రోజులుగా ఆందోళన చేస్తున్నారు. నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ విధానంలో వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై తమ పొట్ట కొడుతున్నారని చెబుతున్నారు

ఈ నెల 1 నుంచి అన్ని వ్యవసాయ మార్కెట్లలోనూ NAM విధానం ప్రారంభమైంది. అయితే పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో మాత్రం NAM ను సరిగ్గా అమలు చేయడంలేదంటున్నారు రైతులు. నాణ్యతలేదని సాకులు చెబుతూ రేటు తక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నామ్ విధానం వ్యాపారులకు వరంగా మారిందంటున్నారు.  అధికారులు కూడా వ్యాపారులతో కుమ్మక్కయ్యారంటున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి రైతులు 10 సార్లు మార్కెట్లో ఆందోళన చేశారు. రోడ్లపైనా దర్నాలు చేశారు.

వ్యాపారులు కూడా సిండికేట్ గా ఏర్పడి పత్తి కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నామ్ అమల్లోకి రాకముందు పత్తికి క్వింటాలుకు 5500 నుంచి 5700 దాకా పలకగా… ఇప్పుడు 5000 నుంచి 5300 వరకు మాత్రమే రేటు పెడుతున్నారని రైతులంటున్నారు.

నామ్ విధానంపై రైతుల్లో అవగాహన లేకపోవడం కూడా వ్యాపారులకు కలిసివస్తోంది. అవగాహన కల్పించాల్సిన అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. కామన్ గానే రైతులు నష్టపోతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy