పదకొండేళ్ల కనిష్ఠ స్థాయికి చేరిన క్రూడ్ ఆయిల్ ధరలు

crude oilదశాబ్దకాలం తర్వాత భారీ పతనం. 11 ఏళ్ల కనిష్ట స్థాయికి ధరలు. 2008 గ్లోబల్ క్రైసిస్ కన్నా ధరల్లో దారుణమైన  పతనం. ఇదీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పరిస్థితి. బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ కు  36 డాలర్లకు దిగొచ్చింది.

 

 

 

11 ఏళ్ల కనిష్టానికి క్రూడ్ ఆయిల్ ధరలు

బ్యారెల్ ముడిచమురు ధర 36.09 డాలర్లు

2004లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 34.32 డాలర్లు

మరికొన్ని నెలల్లో 20 డాలర్లకు దిగొచ్చే ఛాన్స్

ఇదీ ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పరిస్థితి. గతేడాది 130 డాలర్ల దాకా పరుగులు పెట్టిన బ్యారెల్ బ్రెంట్ ఆయిల్ ధర… ఏడాది కాలంలో నేలచూపులు చూస్తూనే ఉంది. ముడిచమురు ధర జెట్ స్పీడ్ తో పతనమవుతోంది.

ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ ఆయిల్ ధర 36.09 డాలర్లు. బ్యారెల్ కు సుమారు 120 లీటర్లు. అంటే 120 లీటర్ల డ్రమ్ముకు 2392 రూపాయలు. మన కరెన్సీలో లీటర్ 20 రూపాయల కంటే తక్కువే అన్నట్టు. కానీ మన దగ్గర లోకల్ టాక్సెస్, దిగుమతి సుంకం, ఎక్సైజ్ డ్యూటీ లాంటివన్నీ కలిపి తడిసిమోపెడవుతుండటంతో.. చమురు ధరలు తగ్గినా వాటి ప్రయోజనం వినియోగదారుడికి చేరట్లేదన్న మాట.

2014లో 120 డాలర్లను దాటిపోయింది బ్రెంట్ ఆయిల్ ధర. దాంతో యూపీఏ హయాంలో సెంచరీ మార్క్ వైపు పరుగులు తీసింది. అప్పట్లో ఆల్ టైం హైకి చేరిన ధరలు.. ఈ ఏడాదిన్నరలో నేలచూపులు చూస్తున్నాయి. 18 నెలల్లో ఏకంగా మూడింట రెండొంతుల ధర తగ్గింది.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం… అతిపెద్ద వినియోగదారైన అమెరికాలో ఆయిల్ నిల్వలు పెరిగిపోవడంతో ధరల పతనం కొనసాగింది. దీనికితోడు అంతర్జాతీయంగా ముడిచమురు ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. పైగా కొత్తగా డ్రిల్లింగ్ రిగ్గులెన్నో చమురువెలికితీతకు రంగంలోకి దిగాయి. ఇవన్నీ కలిపి ఆయిల్ ధరల పతనాన్ని శాసిస్తున్నాయి.

11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన చమురు ధరలు.. మరింత దిగొచ్చే అవకాశముందంటున్నాయి గోల్డ్ మాన్ శాక్స్, CLSA లాంటి సంస్థలు. రాబోయే రోజుల్లో బ్యారెల్ ధర 20 డాలర్లకు పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాయి. ఆయిల్ ఎక్స్ పోర్ట్ కంట్రీస్ ఉత్తత్తిని స్థిరంగా కొనసాగిస్తుండటం… అంతర్జాతీయ వృద్ధిలో మందగమన భయాలు దీనికి కారణమని వాటి విశ్లేషణ.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy