పదవుల కోసం బయటికి రాలేదు : సీఎం కేసీఆర్

KCR-IMAGE2టీఆర్ఎస్ పార్టీ పెట్టడం వెనుక ఉన్న కారణాలు వెల్లడించారు సీఎం కేసీఆర్. అందరూ అనుకున్నట్లు పదవుల కోసం తాను బయటికి రాలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తనలో ఉన్న నిబద్ధతతోనే బయటికొచ్చినట్లు తెలిపారు. తెలంగాణ కోసం 1996 కు ముందు నుంచే తమలో ఆకాంక్ష ఉండేదని తెలిపారు. ఆరోగ్యం సహకరిస్తే తెలంగాణ ఏర్పడే వరకు ఉద్యమిస్తానని 1996లో శ్రీరాం సాగర్ ప్రాజెక్టుపై ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు. అంతేకాని పదవుల కోసం బయటికి రాలేదని, ఇలాంటి విమర్శలు చేసే వారికి ఈ విషయం తెలియదని అన్నారు. శనివారం ప్రొఫెసర్.జయశంకర్ సార్ మూడవ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ భవన్ లో నివాళులు అర్పించిన సీఎం.. సార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాలగమనంలో కొందరు చరిత్రను సృష్టించేందుకు పుడతారని, జయశంకర్ సార్ కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి చరిత్ర సృష్టించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ప్రజలు స్వతంత్రంగా బతకాలనేదే సార్ ఆశయమని తెలిపారు. సార్ కనుమూసి మూడేళ్లు గడిచిపోయాయని, రాష్ట్ర ఏర్పడిన శుభసందర్భంలో సార్ తమ మధ్య లేకుండా పోవడం బాధాకరమన్నారు. సార్ దాదాపు 500 పాఠాలు చెప్పారని, తమకు తెలియని ఎన్నో విషయాలను, చరిత్రను చెప్పారని తెలిపారు. సార్ తో ఎప్పుడూ తెలంగాణ గురించే చర్చించేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రమనే మాట ఇకనుంచి లేదని, ఇక నుంచి అంతా ఆంధ్రప్రదేశేనని ఒక ఆంధ్రా అధికారి చేసిన వ్యాఖ్యలతో ఆయనకు తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడాలనే సంకల్పం కలిగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడక ముందే దాదాపు 20 మీటింగ్ లు ఏర్పాటు చేశామని, ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని తెలిపారు. తెలంగాణకు జయశంకర్ సార్ మార్గ నిర్దేశకుడని అన్నారు.  1969 ఉద్యమం కరక్టేనా.. అయితే ఎందుకు విఫలమైందని ఎన్నో విశ్లేషణలు చేశామన్నారు. ఆ తర్వాత సార్ అమెరికా నుంచి వచ్చాక దీనిపై చర్చించామని తెలిపారు. తెలంగాణ అస్తిస్థం కోల్పోయేలా ఆంధ్రా నుంచి దాడి జరిగిందని, చరిత్ర తెలవకుండా ఆంధ్రా పాలకులు చేశారని, కానీ చరిత్రను సార్ తమకు పాఠాల రూపంలో చెప్పారని గుర్తు చేశారు. 1969 ఉద్యమం సక్సెస్ కాకపోయినా.. సార్ మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించిన పోరాటం మాత్రం ఆపలేదన్నారు. అప్పట్నుంచి ప్రతీ ఏడాది ప్రభుత్వ బడ్జెట్ సేకరించి.. తెలంగాణకు ఎంత మోసం జరుగుతుందో, ఆంధ్రాకు ఎంత మోసుకుపోయారని విశ్లేషణలు చేసేవారని తెలిపారు. చిన్న చిన్న సమావేశాలకు హాజరై అందరికీ ఉద్యమ చరిత్ర చెప్పి, అవేర్ నెస్ తెచ్చేందుకు కృషి చేశారన్నారు. ఆయన జీవితాన్ని తెలుసుకేంటే.. ఒక సిద్ధాంతాన్నినమ్ముకుంటే ఎంత కట్టుబడి ఉండాలో అర్థమవుతుందని అన్నారు. ఆంధ్రా భాషాధిపత్యాన్ని ప్రశ్నించిన వ్యక్తి అని, ఆంధ్రా లోని అన్ని యూనివర్సిటీలల్లో ఉపన్యాసాలిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని ఒప్పించిన వ్యక్తి అని సార్ గొప్పతనాన్ని తెలిపారు.  అలాగే దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఉపన్యాసాలిచ్చి.. తెలంగాణ కావాల్సిందేనని అందిరితో ఒప్పించిన వ్యక్తి జయశంకర్ సారని అన్నారు. ఇంత చేసిన సార్.. రాష్ట్రం ఏర్పడే వరకు బతికుంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త జిల్లాకు సార్ పేరు..హైదరాబాద్ లో మెమొరియల్ ట్రస్టు :

ప్రొ.జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ భవన్ లో సార్ విగ్రహానికి పూలమల వేసి నివాళులర్పించారు సీం కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అస్థిత్వం కోసం పోరాడిన వ్యక్తి జయశంకర్ సారని అన్నారు. కొత్తగా ఏర్పడే జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెట్టనున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్ లో జయశంకర్ మెమొరియల్ ట్రస్టుతో పాటు, ప్రధానమైన స్థలంలో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్ లోని ఏకశిలా పార్కుకు జయశంకర్ సార్ పెట్టనున్నట్లు తెలిపారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy