పది రూపాయలకే మలేరియా పరీక్ష

MALARIA1పది రూపాయల ఖర్చుతో కొన్ని క్షణాల్లోనే మలేరియా వ్యాధిని గుర్తించే యాప్, కిట్ ను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ఈ కిట్ ను తీసుకుని ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే ఇక ఇంట్లోనే మలేరియా పరీక్ష చేసుకోవచ్చు. పేపర్ మైక్రోస్కోప్ (ఫోల్డ్ స్కోప్) కు మొబైల్ కెమెరాను జతపరిచి, యాప్ ద్వారా సెంట్రల్ డేటాబేస్ కు అనుసంధానిస్తారు. సంబధిత వ్యక్తి, ఈ మైక్రోస్కోప్ పేపర్ లో ఓ రక్తపుబొట్టును వేసి మొబైల్ కెమెరాతో  క్యాప్చర్ చేయాలి. ఆ చిత్రాలను యాప్ లో అప్ లోడ్ చేయాలి. ఆ నమూనాలోని రక్తకణాల్లో మలేరియా  సెల్స్ ఉన్నదదీ,లేనిదీ సెంట్రల్ డేటాబేస్ విశ్లేషించి ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకున్న వైద్యులకు చేరవేస్తుంది. ఈ ఫలితాల ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తారు. ‘సెంటార్’ అని పిలిచే ఈ కిట్ ను తయారు చేయడానికి రూ.80 ఖర్చవుతుంది. ఈ కిట్ కు కొన్ని మార్పులు చేస్తే డెంగ్యూ టెస్ట్ కూడా చేసుకోవచ్చునని తెలిపారు కోల్ కత్తాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy