పది రూపాయలకే సింగపూర్ ప్రయాణం..!

tigerఎయిర్ టికెట్ ఆఫర్స్ రేసులోకి ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీసులు ఎంట్రీ ఇచ్చాయి. ఇంటర్నేషనల్ రూట్లలో ఎయిర్ టికెట్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించాయి. తమ కంపెనీ ప్రారంభమై 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నందుకు టైగర్ ఎయిర్వేస్ పది రూపాయలకే సింగపూర్ ఫ్లయిట్ టికెట్ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కాని అన్ని టాక్స్ లు కలుపుకొని 7 వేల 5 వందలు ఉంటుంది టికెట్ ధర. ఈ నెల 21 వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ తో వచ్చే ఏడాది జనవరి 12 నుండి మార్చ్ 31 వరకు ప్రయాణం చేయవచ్చు. అలాగే, ’ద వర్డ్ ఈజ్ యువర్స్’ పేరుతో ఖతర్ ఎయిర్ వేస్ కూడా 25 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంది. 140 ఇంటర్నేషనల్ రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy