పదేళ్లకే పోలీస్ కమిషనర్ అయ్యాడు

Madipalli roopఆ బాలుడి వయసు పదేళ్లు. సిటీ కాప్స్ కు బాస్ అయ్యాడు. పోలీస్ బాస్ కుర్చీలో కూర్చొని.. దర్జా ఒలకబోశాడు. పోలీసులతో సెల్యూట్ చేయించుకున్నాడు. ఇదంతా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ బాలుడి కోసం మేక్ ఏ విష్ ఫౌండేషన్, సిటీ పోలీసులు కలిసి క్రియేట్ చేసిన సీన్. పోలీస్ ఆఫీసర్ కావాలన్న చిన్నారి కలను ఇలా నిజం చేశారు ఈ పెద్దలు.

నల్గొండ జిల్లా సూర్యాపేట్ కు చెందిన రూప్ కొంత కాలంగా క్యాన్సర్ తో భాదపడుతున్నాడు. రూప్ కు పెద్దయ్యాక  ఐపీఎస్ కావాలన్నది కల. ఇది తెలుసుకున్న మేక్ ఏ విష్ సంస్థ ఆ బాలుడి కల నేరవేర్చాలని డిసైడ్ అయింది. సీటి  కమిషనర్ మహేందర్ రెడ్డి సహకారంతో బాలుడి కలను తీర్చారు. వన్ డే సీపీగా బాధ్యతలు స్వీకరించిన రూప్.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తానని తెలిపాడు.

one-day-commissionerరూప్ నిజ జీవితంలో కూడా కమిషనర్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు సీపీ మహేందర్ రెడ్డి. ఇంత చిన్న వయస్సులో వ్యాధి బారినపడిన రూప్ కు దేవుడే మేలు చేయాలన్నారు. పోలీసు కమిషనర్ కావాలన్న తన కుమారుడి కోరిక తీర్చిన… పోలీసులు, మేక్ ఏ విష్ పౌండేషన్ కు పేరెంట్స్ కృతజ్ఞతలు చెప్పారు. రూప్ కు 20 రోజులకు ఒకసారి బ్లడ్ మార్చాలని..బ్లడ్ ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. చిన్నారుల కోరిక తీర్చడానికి మేక్ ఎ విష్ సంస్థ చేస్తున్న కృషిని అందరూ అభినందించారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy