పదేళ్ల తర్వాత ఇండియాలో నీళ్లు దొరకవ్..!!

Residents of Sanjay Colony fill their water containers in New Delhiనీటికోసం యుద్దాలు తప్పవన్న మేథావుల మాటలు నిజమయ్యే రోజు మరెంతో దూరం లేదనిపిస్తోంది. నీటి కటకట మరింత తీవ్ర  కావడానికి పదేళ్లు చాలంటున్నారు నిపుణులు, నీటి లభ్యత, సరఫరా, వినియోగాల మధ్య వస్తున్న గ్యాప్… భారత్ ను నీటికొరత తీవ్రంగా ఉన్న దేశంగా మార్చేయడం ఖాయమంటున్నాయి సర్వేలు. వచ్చే పదేళ్లలో ఇండియా తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోబోతోంది. 2025 కల్లా దేశం నీటి కోసం అల్లాడనుంది. 2025 వరకల్లా… ఇండియా వాటర్ స్కేర్సిటీ కంట్రీగా మారుతుందని నివేదికలు చెబుతున్నాయి. డిమాండ్-సప్లై మధ్య భారీగా పెరుగుతున్న అంతరం ఇండియాలో అతి తీవ్రమైన నీటి కొరతకు కారణమవుతుందని సర్వేలు చెబుతున్నాయి.

EA వాటర్ సంస్థ… ఇండియాలో నీటి లభ్యతపై స్టడీ చేసింది. వచ్చే పదేళ్లలో డొమెస్టిక్, ఇండస్ట్రియల్ సెక్టార్స్ లో… నీటి వినియోగం భారీగా పెరగనుంది అంచనా వేసింది. దేశంలో సాగునీటి అవసరాల కోసం 70శాతం, తాగునీరు, ఇతర అవసరాల కోసం 80శాతం భూగర్భ జలాన్నే ఉపయోగిస్తున్నారు. రానున్న పదేళ్లలో ఇది మరింత పెరుగుతుందని… దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని… సర్వే చెబుతోంది. దీని వల్ల నీటి కొరత తీవ్రమవుతుందని అంచనా వేస్తోంది. ఇక నీటి లభ్యత తగ్గుతున్నప్పటికీ… వాటర్ సెక్టార్ లో భారీగా పెట్టుబడులు వచ్చే చాన్సుందని EA వాటర్ అభిప్రాయపడింది. వచ్చే పదేళ్లలో… దాదాపు 83వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వచ్చే మూడేళ్లలోనే 18వేల కోట్ల పెట్టుబడులను వాటర్ ఇండస్ట్రీ ఆశిస్తోందని అంచనా. వాటర్ సప్లై, వేస్ట్ వాటర్ మేనేజ్ మెంట్ రంగాల్లో పెద్ద స్థాయిలో ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ అవుతుందని సర్వేలో తేలింది. ప్రభుత్వం కూడా… వాటర్ క్రైసిస్ ను ఎదుర్కొనేందుకు… ఈ రంగానికి భారీగా నిధులు కేటాయించాలని అభిప్రాయపడింది. ఇక వేస్ట్ వాటర్ రీసైక్లింగ్, ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్ మెంట్ మార్కెట్ కూడా బలపడుతుందని తేల్చింది.

మహారాష్ట్ర వాటర్ సెక్టార్ హబ్ గా మారుతుందని EA వాటర్ అంచనా వేసింది. 12 మల్టినేషనల్ కంపెనీలు… ముంబై, పుణేల్లో డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్స్ ను ఇప్పటికే నిర్మించాయి. 12వందలకు పైగా కంపెనీలు.. వాటర్, వేస్ట్ వాటర్ ట్రీట్ మెంట్ ఫీల్డ్ ని డీల్ చేస్తున్నాయి. ముంబై, పుణేల్లో సెంట్రలైజ్డ్ వేస్ట్ వాటర్ ట్రీట్ మెంట్, రీసైక్లింగ్ ప్లాంట్స్ ని స్థాపించేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. ఇక పుణే, నాసిక్ లు… నీటికి సంబంధించిన పరికరాల తయారీ హబ్ గా డెవలప్ అవుతాయని తేలింది. కేంద్ర ప్రభుత్వం కూడా వాటర్ సెక్టార్ లో పెట్టుబడులు పెడుతోంది. గంగా శుద్ది ప్రాజెక్ట్, స్మార్ట్ సిటీలు, స్వచ్ఛ్ భారత్ లాంటి కార్యక్రమాలు ద్వారా నీటి కొరతను కొంతవరకు తగ్గించవచ్చని EA వాటర్ రిపోర్ట్ చెబుతోంది. వచ్చే పదేళ్లలో వాటర్ సెక్టార్ లో… 10లక్షలకు ఉద్యోగాలు కూడా క్రియేట్ అయ్యే అవకాశముందనేది రిపోర్ట్ సమ్మరీ.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy