
పద్మావతిపై ఆందోళనలతో పోలీసులను అప్రమత్తం చేసి శాంతిభద్రతల సమస్యలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. పురాతన కాలంనాటి చరిత్రను భావితరాలు గుర్తుంచుకునే గొప్ప సినిమాలను బన్సాలీ తెరకెక్కిస్తున్నారని..అటువంటి జీనియస్ డైరెక్టర్‌కు భద్రత కల్పించాలని సీఎం ఫడ్నవిస్‌ను కోరింది అసోసియేషన్. కొత్త డైరెక్టర్లకు ఫిల్మ్ మేకింగ్ సంబంధించి సంజయ్ లీలా బన్సాలీ సినిమాలు గొప్ప పాఠాలుగా నిలుస్తాయని తెలిపింది అసోసియేషన్. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన ‘పద్మావతి’ సినిమాను, డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్.