‘పద్మావతి’ ఎఫెక్ట్ : దీపిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ భద్రత

Deepika-padmavathi‘పద్మావతి’ సినిమా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమా హీరోయిన్ దీపక పదుకొనే, ఆమె కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత కల్పించాలని నిర్ణయించింది కర్ణాటక ప్రభుత్వం. రాష్ట్రంలో దీపిక, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీ-ఐజీపీని ఆదేశించినట్టు హోం మంత్రి రామలింగా రెడ్డి సోమవారం (నవంబర్-20) మీడియాకు తెలిపారు. దీపిక పదుకొనే (పద్మావతి)కి వ్యతిరేకంగా బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలను ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ తప్పుపట్టారు.

అసహనం, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు బీజేపీ పాల్పడుతోందని ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. దీపిక పదుకొనేకి తగిన భద్రత కల్పించాల్సిందిగా కేంద్రానికి సీఎం సిద్ధరామయ్య లేఖ రాయాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్రంలో దీపిక పర్యటించే సమయంలో ఆమెకు హోం మంత్రి తగిన భద్రత కల్పించాలని కూడా శివకుమార్ సూచించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy