పనిచేసే సత్తా ఉంటేనే సత్తుపల్లి సీటు

ఎన్నికల నగారా మోగింది. పార్టీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గాల్లో అభివృధ్ధి పనులతో స్ధానిక నాయకత్వం కసరత్తులు. ఆగిన పనులను సాకుగా చూపి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రత్యర్ధుల వ్యుహాలు. దాంతో రాజకీయం రంజుగా మారింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సెగ్మెంట్ లో పొలిటికల్ హీట్ పై  స్పెషల్ స్టోరి.

 • ఖమ్మం జిల్లాలో వీఐపీ సెగ్మెంట్ గా పేరొందింది సత్తుపల్లి నియోజక వర్గం.
 • ఇది 1978లో ఏర్పడింది.
 • 1952 నుంచి 1972 వరకు వేంసూరు నియోజకవర్గ కేంద్రంగా వుండేది సత్తుపల్లి.
 • 1952లో ఇండిపెండెంట్ గా పోటిచేసి ఓడిపోయిన జలగం వెంగళరావు.. తర్వాతి కాలంలో మంత్రిగా, సీఎంగా, కేంద్రమంత్రిగా సేవలందించడం విశేషం.
 • వెంగళరావు వేంసూరులో మూడుసార్లు, సత్తుపల్లిలో ఓసారి గెలిచారు.
 • ఇక టీడీపీలో కీలక పదవులు అలంకరించిన తుమ్మల నాగేశ్వర రావుది కూడా ఈ సెగ్మెంటే.
 • ఆయనే కాకుండా జలగం ప్రసాదరావు కూడా ఈ సెగ్మెంట్ నుంచి గెలిచి మంత్రి అయ్యారు.

……………..

 • సత్తుపల్లి నియోజకవర్గంలో  కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వెంసూరు మండలాలున్నాయి.
 • సెగ్మెంట్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 17 వేల 162.
 • పురుష ఓటర్లు లక్షా 8 వేల 192.
 • మహిళా ఓటర్లు లక్షా 8 వేల 963 మంది వున్నారు.
 • నియోజకవర్గంలో 40 శాతం ఎస్సీ సామాజిక వర్గం వారే వున్నారు.
 • 30 శాతం బీసీలు, 10 ఓసీలు, మరో పదిశాతం ఇతరులు ఉన్నారు.
 • సత్తుపల్లిలో ఇప్పటిదాకా ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం 9 సార్లు ఎన్నికలు జరిగాయి.
 • కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) 5 సార్లు, టీడీపీ 4 సార్లు గెలుపొందాయి. వేంసూరులో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు గెలవగా, ఇండిపెండెంట్ ఓసారి విజయం సాధించారు.

………………………

 • 2004లో జలగం వెంగళరావు రెండో కుమారుడు జలగం వెంకటరావు సత్తుపల్లిలో తుమ్మల నాగేశ్వరావును ఓడించడం సంచలనం.
 • జలగం వెంగళరావు సోదరుడు కొండల్ రావు 1957లో వేంసూరులో గెలుపొందారు.
 • ఆ తర్వాత జలగం వెంగళరావు హవా మొదలైంది.
 • జలగం తర్వాత తుమ్మల నాగేశ్వర్ రావు హవా మొదలైంది.
 • టీడీపీ అధికారంలోకొచ్చాక 1985లో తుమ్మల నాగేశ్వరావు సత్తుపల్లిలో తనదైన మార్క్ వేశారు.
 • హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన తుమ్మల ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లలో మంత్రిగా ఎంపికయ్యారు.
 • తుమ్మల హవా మొదలయ్యాక జలగం వెంగళరావు 1984-89లో ఖమ్మం లోక్ సభ స్ధానం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రి అయ్యారు.
 • ఇక 1978లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రముఖ సాహితీవేత్త కాళోజీ నారాయణరావు ఇక్కడ జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓడిపోయారు.
 • 1984లో టీడీపీ అధికారంలోకి రావడంతో జలగం రాజీనామా చేశారు. దాంతో జరిగిన ఉపఎన్నికల్లో జేష్ట వెంకటేశ్వర్ రావు గెలిచారు.
 • ఇలా సత్తుపల్లి సెగ్మెంట్ రాజకీయంగా ఎన్నో సంచలనాలకు వేదికైంది.

………………………..

 • 2009 ఎన్నికల్లో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పై సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు.
 • డీ లిమిటేషన్ లో భాగంగా 2009లో సత్తుపల్లి జనరల్ నుంచి ఎస్సీ నియోజకవర్గంగా మారింది.
 • పునర్విభజనలో….అశ్వారావుపేట, దమ్మపేట మండలాలను అశ్వారావుపేట నియోజకవర్గంలో చేర్చారు.
 • మధిర నియోజకవర్గంలోని తల్లాడను సత్తుపల్లిలో చేర్చారు.
 • టీడీపీ ఆవిర్భావం తర్వాత సత్తుపల్లి ఆ పార్టీకి కంచుకోటగా మారింది.
 • తుమ్మల ఇంఫ్లుయేన్స్ తో సండ్ర వెంకటవీరయ్య గెలుపు ఈజీ అయింది.
  ……………………………..
  సండ్ర వెంకట వీరయ్య హయాంలో సత్తుపల్లిలో వంద కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టారంటున్నారు. మరోసారి తనకు ఛాన్సివ్వాలని ఓటర్లను కోరుతున్నారు వీరయ్య. ఈసారి కూడా టీడీపీ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు.
 • తెలంగాణ సెంటిమెంట్ ఇక్కడ వర్కవుట్ కాదన్న అంచనాలున్నాయి.
 •  పైగా స్ధానికంగా టీఆర్ ఎస్ కు బలమైన నాయకత్వం లేదు.
 • ఖమ్మం జిల్లా అధినాయకత్వం జిల్లాలో బలమైన అభ్యర్ధులను రంగంలో దింపడంలో విఫలమైంది.
 • ఈసారీ ఇక్కడ పనిచేసేవారికే పట్టం కడతామంటున్న ప్రజల ఆలోచనలకు తగ్గట్టు నడచుకుందామని నాయకులు భావిస్తున్నారు.
 • కాంగ్రెస్ నుంచి సంభాని చంద్రశేఖర్, టీఆర్ఎస్ నుంచి పిడమర్తి రవి, వైసీపీ నుంచి దయానంద్ విజయ్ కుమార్ లు పోటీలో ఉన్నారు.

 • బరిలో ఎంత మంది దిగినా, పోటీ మాత్రం టీడీపీ, కాంగ్రెస్ మధ్యనే వుండే అవకాశాలున్నాయి.

………………….
తెలంగాణ సెంటిమెంట్ కు సత్తుపల్లిలో ఛాన్స్ లేదు. అభివృద్ధికి పట్టంగట్టడం సత్తుపల్లి ప్రత్యేకత. ఏదైతేనేం ఈసారి తీర్పు ఎలా ఉంటుందో తేలాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy