పన్నుల మోత!

2171taxesరాష్ట్ర ప్రభుత్వం మరోసారి పన్నుల మోతకు రెడీ అవుతోంది. ఓట్ ఆన్ అకౌంట్ 2014-2015 బడ్జెట్ ఆదాయానికి వచ్చే ఏడాది నుంచి వ్యాట్ ద్వారా 61వేల950 కోట్ల రూపాయల మేర  ఆదాయం పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీంతో మరోసారి భారీగా పన్నులు పెగరనున్నాయి. పన్నులతో జనం నడ్డి విరిచేందుకు సిద్ధం మవుతోంది కిరణ్ సర్కార్. ఎన్నికల వేళ భారీ బడ్జెట్ ను అమలు చేయటానికి ఆదాయ మార్గాలను వెతుకుతోంది. 2013-2014 ఫైనాన్షియల్ ఇయర్ లో లక్ష్యంగా పెట్టుకున్న 2వేల 500 కోట్ల రాబడి కంటే ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన రాబడి 18 శాతం పెరగనుంది. ఇప్పటికే అన్ని రకాల వస్తువులను వ్యాట్ పరిధిలోకి తెచ్చిన ప్రభుత్వం…. గృహ నిర్మాణాలను కూడా వ్యాట్ పరిధిలోకి తెచ్చేందుకు సిద్దమవుతోంది. మద్యంపై కూడా పన్నులను పెంచనుంది. టాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 8వేల625 కోట్ల రూపాయలకు పెంచింది. దీంతో 2013-2014 ఆర్థిక సంవత్సరం కంటే 15 ఎక్కువ ఆదాయం రానుంది. ఈ లెక్కల ప్రకారం మద్యం నుంచి 11వందల 25 కోట్ల ఆదాయాన్ని రాబట్టనుంది. ప్రభుత్వానికి అధికంగా ఆదాయం వచ్చే వనరుల్లో స్టాంపులు ,రిజిస్ట్రేషన్ల శాఖ ఒకటి. ఈ శాఖ నుంచి భారీగా ఆదాయం పెంచుకొనుంది కిరణ్  సర్కార్. దీని కోసం నివాస స్థలాల ధరలు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు 15 శాతం పెంచనున్నారు. దీంతో ప్రస్తుతం వస్తోన్న 64వేల14 కోట్ల రూపాయల నుంచి 73వేల77 కోట్ల భారం పడనుంది. వాహనాల పన్నుతో 5వేల5 కోట్ల రూపాయలు వస్తోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని 15శాతం పెంచనుంది. దీంతో  653 కోట్ల రూపాయలను వెహికిల్ టాక్స్ ద్వారా పొందనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy